Norway : పోగోట్టుకున్న చెవిపోగుల కోసం వెతుకుతున్న ఫ్యామిలీకి ఏం దొరికిందో తెలుసా?

పోగొట్టుకున్న బంగారు చెవిపోగుల కోసం ఓ కుటుంబం ఇంటి చుట్టూ వెతుకులాట మొదలెట్టింది. వారికి ఊహించనివి దొరికాయి.. అవేంటంటే?

Norway : పోగోట్టుకున్న చెవిపోగుల కోసం వెతుకుతున్న ఫ్యామిలీకి ఏం దొరికిందో తెలుసా?

Norway

Norway : ఏదైనా విలువైన వస్తువు పోతే వెతుకులాట కామనే. దొరికే వరకు మనసు స్థిమితంగా ఉండదు. నార్వేలోని ఓ కుటుంబం చెవి పోగులు పోయాయని ఇంటి చుట్టూ వెతుకులాట మొదలెట్టింది. చెవిపోగులు సంగతి పక్కన పెడితే వారికి ఏం దొరికాయో తెలుసా?

Netherlands : 4 వేల ఏళ్లనాటి స్మశాన వాటికలో 60 మంది పురుషులు, మహిళలు, పిల్లల అవశేషాలు ..

నార్వేలో ఓ ఫ్యామిలీ పోగొట్టుకున్న చెవిపోగుల కోసం వెతుకుతుంటే వైకింగ్ యుగం నాటి కళాఖండాలు బయటపడ్డాయి. ఇవి సుమారు 1000 సంవత్సరాలకు క్రితం వస్తువులని తెలుస్తోంది. కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ వెస్ట్ ఫోల్డ్, టెలిమార్క్ కౌంటీ కౌన్సిల్ ఈ కళాఖండాల గురించి ఫేస్ బుక్ లో షేర్ చేసారు. ఇవి ఓవల్ ఆకారంలో ఉండి ఆడవారు దుస్తులకు వాడే వస్తువులుగా తెలుస్తోంది. పోయిన బంగారు చెవిపోగులు వెతుకుతూ మెటల్ డిటెక్టర్ వాడినపుడు ఈ అవశేషాలను తవ్వి తీశారు.

Viral News: బంగారు గనుల్లో ‘మమ్మీ’ అవశేషాలు.. 30వేల సంవత్సరాల క్రితం..

ఈ అరుదైన కళాఖండాలు బయటపడటంతో ఆ ఫ్యామిలీని టెలిమార్క్ కౌంటీ కౌన్సిల్ అభినందించింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే చాలామంది పోయిన చెవిపోగులు దొరికాయా? లేదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ కళాఖండాలు దొరకడం, అవేమిటో గుర్తించడంలో బిజీగా గడిపిన ఫ్యామిలీ ప్రస్తుతానికి చెవిపోగుల సంగతి మర్చిపోయి ఉంటుంది.