Cattle Diseases : పాడిపశువుల్లో గొంతువాపు వ్యాధి…నివారణ చర్యలు

గొంతు వాపు వ్యాధి బారిన పడిన పశువులను మిగతా పశువులతో కలిపి ఉంచితే వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఒకే పాకలో ఉంచకుండా వాటిని వేరు చేయాలి. వ్యాధి సోకిన పశువు తిన్న గడ్డిని ఆరోగ్యకరమైన పశువు తినడం వల్ల కూడా వ్యాధి సోకే అవకాశం ఉంటుంది.

Cattle Diseases : పాడిపశువుల్లో గొంతువాపు వ్యాధి…నివారణ చర్యలు

Throat disease in dairy cattle...prevention measures

Cattle Diseases : పశువులకు సోకే వ్యాధుల్లో గొంతువాపు వ్యాధి ప్రమాదకరమైనది. ఈ వ్యాధిని గురక వ్యాధిని అనికూడా పిలుస్తారు. వర్షకాలంలో పశువులకు సూక్ష్మ జీవుల వల్ల సంక్రమిస్తుంది. తొలకరి వర్షాలు పడిన సందర్భంలో కలుషితమైన నీరు ద్వారా, మేత ద్వారా పశువులకు రోగ నిరోధక శక్తి తగ్గటం వల్ల వ్యాధి బారిన పడతాయి. అంటు వ్యాధిగా ఇతర పశువులకు సోకుతుంది.

READ ALSO : Disease to Cattle : పాడి పశువుల్లో పొదుగువాపు వ్యాధి, నివారణ

గొంతు వాపు వ్యాధి బారిన పడిన పశువులను మిగతా పశువులతో కలిపి ఉంచితే వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఒకే పాకలో ఉంచకుండా వాటిని వేరు చేయాలి. వ్యాధి సోకిన పశువు తిన్న గడ్డిని ఆరోగ్యకరమైన పశువు తినడం వల్ల కూడా వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన పశువు నోటి నుండి కారే చొంగ ద్వారా కూడా వ్యాపిస్తుంది.
ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పశువులు రవాణా చేసే సందర్భంలో వ్యాధి సోకుతుంది.

వ్యాధి లక్షణాలు ;
1. వ్యాధి కారక సూక్ష్మ జీవులు పశువుల శరీరంలోకి ప్రవేశించిన 5 రోజుల లోపు వ్యాధి లక్షణాలు కన్పిస్తాయి. జ్వర తీవ్రత 104 నుండి 106 డిగ్రీల వరకు ఉంటుంది.

2. చర్మం వదులుగా ఉన్న చోట ద్రవం చేరి గొంతు భాగం ఉబ్బి ఉంటుంది. చేతితో గట్టిగా వత్తితే గుంట మాదిరిగా ఏర్పడుతుంది. కళ్ల నుండి నీరు, ముక్కు నుండి ద్రవం కారుతుంది.

3. పశువు ఆయస పడుతూ శ్వాస పీలుస్తుంది. గుర్రుగుర్రుమని శబ్ధం వస్తుంది. పశువులకు శ్వాస తీసుకోవటం కష్టంగా మారుతుంది.

4. ఊపిరి తిత్తులు, శ్వాసవాహికల్లో పుండ్లు ఏర్పడి చీము చేరుతుంది. విపరీతంగా దగ్గు వస్తుంది. శ్వాస మరీ కష్టమై నాలుక బయటికి తీస్తుంది.

5. ఒక్కో సారి వ్యాధి సోకిన పశువులు లక్షణాలు కన్పించిన 24 గంటలలోపు మృత్యువాత పడే ప్రమాదం ఉంటుంది.

READ ALSO : Cattle : పాడి పశువుల్లో గర్భాశయ సమస్యలు, నివారణ చర్యలు

నివారణ చర్యలు ;

రక్త పరీక్ష చేయించి బైపోలార్ గ్రామ్ నెగెటివ్ బ్యాక్టీరియాను గుర్తించటం వల్ల వ్యాధిని నిర్ధారిస్తారు. పశువు చనిపోయిన తరువాత శవ పరీక్ష చేసి కూడా వ్యాధిని నిర్దారించవచ్చు. దీని నివారణకు 30మి.లీ సల్ఫాడిమిన్ మందులు 3 రోజుల పాటు రక్తంలో ఎక్కించాలి. చర్మం కింది కండకు కూడా మందును ఇంజక్షన్ రూపంలో ఇవ్వవచ్చు. క్లోరం ఫఎనికాల్, ఆక్సిటెట్రాసైక్లిన్, సెఫట్రైక్సోమ్, సల్ఫామందులను 15 మి.లీ మోతాదులో 3 రోజుల పాటు కండకు ఇవ్వాలి. వాపు తగ్గటానికి కార్టిబోన్, జోబిడ్ వంటి మందులను 15మి.లీ మోతాదులో 3 రోజుల పాటు కండకు ఇవ్వాలి.