Wellness Conference: హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సదస్సు కోసం కలిసిన గోధుమ పరిశ్రమ నాయకులు, న్యూట్రిషన్‌ నిపుణులు

ఈ సెమినార్‌లో నిపుణులు ఆరోగ్య, సంక్షేమ పరంగా గోధుములు, గోధుమ ఉత్పత్తుల ప్రాధాన్యతను చర్చించారు. పెద్ద వయసు వ్యక్తులు నాణ్యమైన ఆహార పదార్ధాలపై ఆధారపడుతున్నారు. ఈ ఆహార పదార్థాలు శక్తి, ప్రొటీన్‌, కార్బోహైడ్రేట్స్‌, ఫైబర్‌, విటమిన్‌, మినరల్స్‌ అయిన థియామిన్‌, ఫోలేట్‌, ఐరన్‌, కాల్షియం, సెలీనియం వంటి వాటికి వనరులుగా ఉన్నాయి. ఇతర ప్రొటీన్‌ వనరులతో పోలిస్తే గోధుమల నుంచి లభించే ప్రొటీన్‌ ఖర్చు తక్కువ

Wellness Conference: హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సదస్సు కోసం కలిసిన గోధుమ పరిశ్రమ నాయకులు, న్యూట్రిషన్‌ నిపుణులు

Wheat industry leaders and nutrition experts gather for health and wellness conference

Wellness Conference: వీట్‌ ప్రొడక్ట్ప్‌ ప్రొమోషన్‌ సొసైటీ (డబ్ల్యుపీపీఎస్‌) శుక్రవారం హైదరాబాద్‌లో హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కోసం గోధుమలు, గోధుమ ఉత్పత్తులపై ఇండస్ట్రీ సపోర్టర్ల మద్దతుతో సదస్సు నిర్వహించింది. కొవిడ్‌ కారణంగా భౌతికంగా నిర్వహించిన మొట్టమొదటి సెమినార్‌గా ఇది నిలిచింది. గోధుమతో పాటు గోధుమ ఆధారిత ఆహార రంగంలో ఉన్న స్టేక్‌హోల్డర్లకు ప్రాతినిధ్యం వహించే అత్యున్నత సంస్థ డబ్ల్యుపీపీఎస్‌. వాల్యూచైన్‌లో ప్రతి విభాగంలోనూ వృద్ధి కనిపిస్తుండటంతో గోధుమ నాణ్యత, వ్యవసాయ ఉత్పాదకత, వ్యర్ధాల తగ్గింపు, ప్రాసెసింగ్‌లో సామర్ధ్యం, వినియోగం, గోధుమ వినియోగానికి ప్రాచుర్యం కల్పించడం, వంటివి ఆందోళనగా మారుతుంది. డబ్ల్యుపీపీఎస్‌ ప్రభావవంతంగా అవసరమైన చర్చలను సమావేశాలు, సదస్సుల నిర్వహణ ద్వారా తీసుకురావడంతో పాటుగా లక్ష్యిత చర్చాకార్యక్రమాలను విధాన నిర్ణేతలతో చేస్తూనే, అధ్యయనాలు, సర్వేలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది.

ప్రపంచంలో అత్యధికంగా గోధుమ పండించే దేశాలలో ఇండియా ఒకటి. అంతేకాదు గోధుమ ఆధారిత బిస్కెట్ల తయారీపరంగానూ అగ్రగామిగా ఉంది. గోధుమ ప్రాసెసింగ్‌ పరంగా హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఉండటంతో పాటుగా బేకరీ సాంకేతికత, న్యూట్రిషన్‌, ఆవిష్కరణల కేంద్రాలూ ఉన్నాయి.
వీట్‌ ప్రొడక్ట్స్‌ ప్రొమోషన్‌ సొసైటీ (డబ్ల్యుపీపీఎస్‌) ఛైర్మన్‌ అజయ్‌ గోయల్‌ మాట్లాడుతూ ‘‘భారతదేశంలో ఆహార భద్రత దిశగా కృషి చేస్తున్న వేళ, మనమంతా కూడా న్యూట్రిషన్‌ భద్రతకు ప్రాధాన్యతనివ్వాల్సి ఉంది. గోధుమ ఆధారిత ఆహారంలో మ్యాక్రో మయు మైక్రో న్యూట్రియంట్స్‌ ఉంటాయి. ఈ సెమినార్‌ ద్వారా ఆ సామర్థ్యంను వెల్లడించే దిశగా అతిముఖ్యమైన ముందడుగు వేస్తున్నాము. భారతదేశంలో గోధుమ పరిశ్రమ వైవిధ్యమైనది. అత్యంత శక్తివంతమైనది కూడా. విస్తృతశ్రేణిలో భారీ, చిన్న తరహా ఉత్పత్తిదారులు, ప్రాసెసింగ్‌ కంపెనీలు ఆధారపడ్డాయి. న్యూట్రిషన్‌, హెల్త్‌, సౌకర్యం కోసం మారుతున్న వినియోగదారుల అవసరాలను మనం అందుకోవాల్సి ఉంది’’ అని అన్నారు.

ఈ సెమినార్‌లో నిపుణులు ఆరోగ్య, సంక్షేమ పరంగా గోధుములు, గోధుమ ఉత్పత్తుల ప్రాధాన్యతను చర్చించారు. పెద్ద వయసు వ్యక్తులు నాణ్యమైన ఆహార పదార్ధాలపై ఆధారపడుతున్నారు. ఈ ఆహార పదార్థాలు శక్తి, ప్రొటీన్‌, కార్బోహైడ్రేట్స్‌, ఫైబర్‌, విటమిన్‌, మినరల్స్‌ అయిన థియామిన్‌, ఫోలేట్‌, ఐరన్‌, కాల్షియం, సెలీనియం వంటి వాటికి వనరులుగా ఉన్నాయి. ఇతర ప్రొటీన్‌ వనరులతో పోలిస్తే గోధుమల నుంచి లభించే ప్రొటీన్‌ ఖర్చు తక్కువ. సాంకేతిక సదస్సులలో గోధుమలు జీర్ణమయ్యే తీరు, పనితీరు గురించి చర్చించారు.