Varanasi: ఎం ప్లాన్ చేస్తున్నావ్ జక్కన్నా.. 5 అవతారాల్లో మహేష్ బాబు.. ఊహకు కూడా అందదు..
సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా జరిగిన భారీ ఈవెంట్ లో ఈ సినిమాకు వారణాసి(Varanasi) అనే టైటిల్ ఫిక్స్ చేశామంటూ తెలిపారు మేకర్స్.
Mahesh Babu will be seen in 5 different avatars in the Varanasi film.
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా జరిగిన భారీ ఈవెంట్ లో ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేశామంటూ తెలిపారు మేకర్స్. ఈ సంధర్బంగా విడుదల చేసిన టీజర్ కి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. కేవలం ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ లెవల్లో ఈ టీజర్ ట్రెండ్ అయ్యింది. ఈ ఒక్క రీజన్ చాలు వారణాసి(Varanasi) సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో. ఇక ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. అందుకోసం ఏకంగా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నారు మేకర్స్.
ఇక వారణాసి కథ విషయంలో కూడా కాంప్రమైజ్ అవలేదు జక్కన్న. ఈ సినిమా కోసం భారత ఇతిహాసాలు, కాలంలో ప్రయాణించడం లాంటి భారీ ఎలిమెంట్స్ ని తీసుకుంటున్నాడు. అందుకే, టీజర్ లో కూడా ఆ ఎలిమెంట్స్ ని హైలెట్ చేశాడు రాజమౌళి. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తిమైన న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే, మహేష్ బాబు ఈ సినిమాలో ఇప్పటివరకు కనిపించని సరికొత్త అవతారాల్లో కనిపించనున్నాడట. అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా 5 అవతారాలు.
ఇప్పటికే ఆ 5 అవతారాల్లో రెండు అవతారాల గురించి రాజమౌళి చెప్పేశాడు. అందులో ఒకటి రుద్ర కాగా.. రెండవది శ్రీరాముడు. ఈ రెండు పాత్రల గురించి రాజమౌళి చెప్పగానే సినిమా =పై ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ అయ్యింది. ఇక మూడు పాత్రలు కూడా ఎవరు ఊహించని విదంగా ఉంటాయని టాక్ నడుస్తోంది. ఐదు అవతారాలు, ఐదు కాలమానాలు.. ఇలా ఒకదానికి మరికొట్టి లింక్ చేస్తూ ఒక రేంజ్ లో సెట్ చేశాడట రాజమౌళి. అందుకే, ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలలోనే కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. మరి మహేష్ బాబు చేస్తున్న ఆ మూడు పాత్రలు ఏంటో అనేది తెలియాలంటే రాజమౌళి చెప్పేవరకు ఆగాల్సిందే.
