Maruthi: ప్రగతి గారు.. బూతులు తిట్టడం మంచిదే.. మీకు గోల్డ్ మెడల్ వచ్చింది.. నేను రాజా సాబ్ చేస్తున్నాను..

దర్శకుడు మారుతీ(Maruthi) షాకింగ్ కామెంట్స్ చేశాడు. నెగిటీవ్ కామెంట్స్ లేకుంటే మీరు గోల్డ్ మెడల్ కొట్టేవారు కాదు.. నాకు రాజా సాబ్ లాంటి సినిమా వచ్చేది కాదని చెప్పుకొచ్చాడు.

Maruthi: ప్రగతి గారు.. బూతులు తిట్టడం మంచిదే.. మీకు గోల్డ్ మెడల్ వచ్చింది.. నేను రాజా సాబ్ చేస్తున్నాను..

Director Maruthi interesting comments about social media on the negative comments

Updated On : December 11, 2025 / 10:21 AM IST

Maruthi: ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో నెగిటీవ్ కామెంట్స్ ఎక్కువ అయ్యాయి. సెలబ్రెటీలు చేసే చిన్న చిన్న తప్పులకు కూడా ఓవర్ గా రియాక్ట్ అవుతూ పర్సనల్ గా టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా కొంతమంది బూతులు కూడా తిట్టేస్తున్నారు. ఇప్పటికే ఈ నెగిటీవ్ కామెంట్స్ పై చాలా మంది సెలబ్రెటీలు స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో వచ్చే ఈ నెగిటీవ్ కామెంట్స్ పై దర్శకుడు మారుతీ(Maruthi) స్పందించాడు. తాజాగా ఈ దర్శకుడు త్రీ రోజెస్ మూవీ ఈవెంట్ లో పాల్గొన్నాడు.

Karate Kalyani: సినిమాలు లేవు, అవకాశాలు లేవు.. బిగ్ బాస్ వల్ల తీవ్రంగా నష్టపోయా.. నేను ఇలా అవడానికి కారణం అదే..

ఇదే ఈవెంట్ లో నటి ప్రగతి కూడా పాల్గొన్నారు. ఆమె ఇటీవల వెయిట్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. ఈమేరకు ఆమెకు స్టేజిపై సన్మానం కూడా చేశారు. అయితే, సోషల్ మీడియాలో ఆమె పెట్టె వీడియోలకు చాలా మంది నెగిటీవ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాగే, బూతులు కూడా తిడతారు. కానీ, ఆవిడ అవేవి పట్టించుకోకుండా తన లక్ష్యం వైపు ప్రయాణం సాగించి విజయాన్ని సాదించించారు. సరిగా ఇదే విషయాన్ని దర్శకుడు మారుతీ స్టేజిపై ప్రస్తావించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..”ప్రగతి గారికి గోల్డ్ మెడల్ రావడం చాలా గొప్ప విషయం. కానీ, సోషల్ మీడియాలో మిమ్మల్ని తిడుతున్నారు అని ఫీలవకండి. ఎందుకంటే, అలాంటి కామెంట్స్ రాకపోయుంటే మీరు గోల్డ్ మెడల్ కొట్టేవారు కాదు.. నాకు రాజా సాబ్ లాంటి సినిమా వచ్చేది కాదు.

వాళ్ళు.. పనులన్నీ మానుకొని, పాజిటివిటీ మొత్తం చంపుకొని, ఇలా నెగిటివ్ చేయడం అంత ఈజీ కాదు. పాపం, వాళ్ళ దగ్గర ఉన్నది అదే. అదే పంచుతున్నారు. నేను కూడా అదే అనుకుంటాను, ఒరేయ్ నీ దగ్గర ఉన్నది ఇదే కదా అని. అందుకే చెబుతున్నా, ఎవరైనా తిడితే ఆ కామెంట్స్ ని ఎనర్జీగా తీసుకోవాలి. నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి చాలా థాంక్యూ” అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక మారుతీ ప్రభాస్ తో చేస్తున్న రాజా సాబ్ మూవీ 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.