Chiranjeevi-Anand Mahindra: మిమ్మల్ని చూస్తే రతన్ టాటా గుర్తొస్తారు.. ఆనంద్ మహీంద్రాపై చిరు ప్రశంసలు

భారత వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రాపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi-Anand Mahindra) ప్రశంసలు కురుపించారు.

Chiranjeevi-Anand Mahindra: మిమ్మల్ని చూస్తే రతన్ టాటా గుర్తొస్తారు.. ఆనంద్ మహీంద్రాపై చిరు ప్రశంసలు

Chiranjeevi posted on social media, comparing Anand Mahindra to Ratan Tata.

Updated On : December 11, 2025 / 11:51 AM IST

Chiranjeevi-Anand Mahindra; భారత వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రాపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi-Anand Mahindra) ప్రశంసలు కురుపించారు. మిమ్మల్ని చూస్తుంటే రతన్ టాటా గుర్తుకు వస్తారు అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇటీవల తెలంగాణ లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ జరిగిన విషయం తెలిసిందే. ఎంతో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి పలు రంగాల నుంచి దిగ్గజాలు హాజరయ్యారు. అలాగే మెగాస్టార్ చిరంజీవికి కూడా ఆహ్వానం అందింది. ఇదే కార్యక్రమానికి మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మెన్స్ ఆనంద్ మహీంద్రా కూడా హాజరయ్యారు.

Varanasi: ఎం ప్లాన్ చేస్తున్నావ్ జక్కన్నా.. 5 అవతారాల్లో మహేష్ బాబు.. ఊహకు కూడా అందదు..

ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అలాగే చాలా విషయాల గురించి మాట్లాడుకున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా ఆనంద్ మహింద్రను రతన్ టాటాతో పోల్చుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. “డియర్‌ ఆనంద్‌ మహీంద్రా.. మీ వినయం, మీ విధేయత, ఎంత ఎదిగినా ఒదిగుండే తత్వం నిజంగా ఆదర్శనీయం. చాలా విషయాల్లో మిమ్మల్ని చూసినప్పుడు రతన్‌ టాటాను గుర్తుకు వస్తారు. ఆయన, తన విలువలతో గొప్ప వ్యక్తిగా ఎదిగారు. ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సేవా దృక్పధంలో మీ నిబద్ధత చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది.

మీలాంటి వ్యక్తితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి నా కృతజ్ఞతలు” అంటూ రాసుకొచ్చాడు. దీంతో చిరంజీవి చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడితో మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 2026 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.