అమ్మ కానికి గర్భం : నల్గొండలో సరోగసి కలకలం

  • Published By: madhu ,Published On : September 2, 2019 / 09:55 AM IST
అమ్మ కానికి గర్భం : నల్గొండలో సరోగసి కలకలం

అమాయక మహిళలను ట్రాప్ చేసి సరోగసికి చేస్తున్న ముఠా డొంక కదులుతోంది. నల్గొండ, ఖమ్మం జిల్లాలో సరోగసి కలకలం రేపుతోంది. డబ్బులు అధికంగా వస్తాయనే ఆశతో భార్యకు సరోగసి చేయించిన ఘటన వెలుగులోకి రావడంతో ముఠా గుట్టు రట్టవుతోంది. కేసులో సూర్యాపేటకు చెందిన ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిన బారిన ఎంతో మంది మహిళలున్నట్లు తెలుస్తోంది. సరోగసి చేయించుకున్న ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. చికిత్స చేయించుకొనేందుకు డబ్బులు కూడా లేవని అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఈమె భర్త పరారీలో ఉన్నాడు. హైదరాబాద్‌లో ఉన్నాడని పోలీసులు భావిస్తున్నారు. ఇతనికి ఎవరు సహకరించారో అతను పట్టుబడితే కానీ తెలియదు. 

వివరాల్లోకి వెళితే..రాజు..శ్రీలత దంపతులు సూర్యాపేట పట్టణంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీలతది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నకిరిపేట. సరోగసి చేయించుకుంటే..నాలుగు లక్షల రూపాయలు వస్తాయని రాజు తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని భార్య శ్రీలతకు తెలియచేశాడు. దీనిని ఆమె వ్యతిరేకించింది. ఎలాగైనా భార్యకు సరోగసి చేయించి..డబ్బులను ఈజీగా సంపాదించవచ్చని ప్లాన్ చేశాడు రాజు. మత్తుమందు ఇచ్చి శ్రీలతకు ఆస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు సరోగసి చేయించారు. తనకు ఆపరేషన్ చేయించారని తెలుసుకున్న శ్రీలత..ఎదిరించింది.

వెంటనే ఆమెకు అబార్షన్ చేశారు. ఈ సరోగసితో మొత్తం ఆమెకు నాలుగు సార్లు ఆపరేషన్ అయినట్లైంది. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. రాజు..మాత్రం నాలుగు లక్షలు తీసుకుని ఉడాయించాడు. ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ముఠా గుట్టును రట్టు చేసేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అద్దె గర్భానికి ఒక్కొక్కరికి రూ. 5 లక్షల దాకా ఇస్తున్నారని తెలుస్తోంది. ఇందులో కొందరు ముఠాలున్నాయని పోలీసులు గుర్తించారు.