Bollywood : బాలీవుడ్ నిర్మాతల సంచలన నిర్ణయం..! హీరోల రెమ్యునరేషన్‌కు కోత పెట్టే ప్లాన్
రెండు, మూడేళ్లుగా షారుక్ ఖాన్ తప్పించి.. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్ లాంటి అగ్రహీరోల సినిమాలు పెద్దగా ఆడలేదు. సినిమాకు పెట్టిన బడ్జెట్‌కు.. రిలీజ్ అయ్యాక వస్తున్న కలెక్షన్లకు చాలా గ్యాప్ ఉంటోంది.

Bollywood : బ్లాక్ బస్టర్లు లేవు. సక్సెస్ అన్న మాట అసలే లేదు. హీరో ఎవరైనా, సినిమా ఏదైనా ఫ్లాప్ మాత్రమే రిజల్ట్ గా మిగులుతోంది. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు డిజాస్టర్ అవుతుండటంతో ఇండస్ట్రీని కాపాడుకునే పనిలో పడ్డారు నిర్మాతలు. హీరోల రెమ్యునరేషన్ ఒకటే కాదు ఎక్స్ ట్రా ఖర్చులకు కూడా కోత పెట్టాలని యోచిస్తున్నారు ప్రొడ్యూసర్లు. అసలు బాలీవుడ్ లో వరుస ఫ్లాపులకు కారణం ఏంటి? హీరోల రెమ్యునరేషన్ తగ్గించడం సాధ్యమేనా?
రెండేళ్లుగా ఫ్లాపులే..
హీరో రెమ్యునరేషన్ వంద కోట్లు, ప్రొడక్షన్ మెయింటెనెన్స్‌కు ప్రతీ రోజు 50 లక్షలు.. ఇక జూనియర్ ఆర్టిస్టులు, పోస్ట్ ప్రొడక్షన్, మూవీ ప్రమోషన్ అంతా కలిపి.. 2 వందల కోట్లకు చేరుకుంటుంది. ఇంత బడ్జెట్ పెట్టారు కదా పెద్ద మూవీ అనుకుంటే.. బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడుతుంది. రెండేళ్లుగా బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఇలాగే ఉంది.
వరుస డిజాస్టర్లు, భారీగా నష్టాలు..
బాలీవుడ్ మూవీస్ డిజాస్టర్‌కు కేరాఫ్‌గా ఉంటున్నాయి. ఏడాదిలో పది పెద్ద సినిమాలు వస్తే అందులో 9 అట్టర్ ఫ్లాప్‌గానే మిగులుతున్నాయి. వరుస ఫ్లాప్‌లతో బాలీవుడ్ ఇండస్ట్రీ సంక్షోభంలోకి వెళ్లింది. కోట్ల రూపాయల నష్టంతో థియేట్రికల్ రిలీజ్‌లు ముగుస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు బాలీవుడ్ సినీ పరిశ్రమ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇండస్ట్రీ బతకాలంటే అదొక్కటే మార్గం..
రెండు, మూడేళ్లుగా షారుక్ ఖాన్ తప్పించి.. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్ లాంటి అగ్రహీరోల సినిమాలు పెద్దగా ఆడలేదు. సినిమాకు పెట్టిన బడ్జెట్‌కు.. రిలీజ్ అయ్యాక వస్తున్న కలెక్షన్లకు చాలా గ్యాప్ ఉంటోంది. హీరోల రెమ్యునరేషన్స్, మిగతా ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలపి మూవీ బడ్జెట్ పెరిగిపోవడమే దీనికి కారణమని భావిస్తున్నారు బాలీవుడ్ నిర్మాతలు. అందుకే హీరోల రెమ్యునరేషన్, వాళ్ల పర్సనల్ టీమ్ మెయింటెనెన్స్ కాస్ట్‌ను తగ్గించాలని.. అలా అయితేనే బాలీవుడ్ ఇండస్ట్రీ బతుకుతుందని అంటున్నారు ప్రొడ్యూసర్లు.
రెమ్యునరేషన్లు తగ్గించుకునేందుకు హీరోలు ఓకే..!
ప్రొడ్యూసర్ల ప్రపోజల్‌కు కొందరు బాలీవుడ్ స్టార్ హీరోలు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. తమ రెమ్యునరేషన్లు తగ్గించుకునేందుకు హీరోలు అంగీకరించడంతో ..మరికొందరిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రొడ్యూసర్లు. రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి పెద్ద హీరోలను ఒప్పిస్తే.. మిగతా హీరోలు, జూనియర్ ఆర్టిస్టులు అందరూ తమ పారితోషికం తగ్గించుకుంటారని భావిస్తున్నారు బాలీవుడ్ ప్రొడ్యూసర్లు.
మూవీ బడ్జెటే కాదు.. ప్రమోషన్స్ ఖర్చు కూడా తగ్గించాలని నిర్ణయం..
ఆన్ గోయింగ్ మూవీస్ బడ్జెట్లలో కూడా చేంజెస్ చేస్తున్నారు. ఎక్కడైతే ఎక్కువగా ఖర్చు పెట్టకూడదో అక్కడ నుంచి వృథాను తగ్గించే స్టెప్స్ స్టార్ట్ చేశారు. త్వరలో ట్రాక్ ఎక్కబోతున్న మూవీస్ బడ్జెట్ కూడా కట్ చేస్తున్నారు. హీరో, హీరోయిన్లతో పాటు ఆర్టిస్టులు, ఆర్టిస్టుల పర్సనల్ టీమ్ రెమ్యునరేషన్ తగ్గింపుపై కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ చేస్తే ఓవరాల్‌గా మూవీ బడ్జెట్ తగ్గి.. అప్పుడే కలెక్షన్స్‌కు.. ఇన్వెస్ట్ చేసిన దానికి బ్రేక్ ఈవెన్ పొజిషన్ అయినా ఉండే అవకాశం ఉంది. మూవీ బడ్జెట్ తగ్గించడమే కాదు.. ప్రమోషన్స్ ఖర్చు కూడా తగ్గించాలని డిసైడ్ చేశారు.
టాలీవుడ్‌లోనూ రెమ్యునరేషన్ తగ్గింపు ప్రస్తావన..
బాలీవుడ్‌లోనే కాదు గతంలో.. టాలీవుడ్‌లో కూడా రెమ్యునరేషన్ తగ్గింపు ప్రస్తావన వచ్చింది. అప్పల్లో కొందరు స్టార్ హీరోలు తాము తీసుకుంటున్న పారితోషికాన్ని తగ్గించుకున్నారు. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో హీరోల రెమ్యునరేషన్ మళ్లీ భారీగా పెరిగిపోయింది. అయితే చిన్న సినిమాలకు మాత్రం టాలీవుడ్, బాలీవుడ్ అని కాదు.. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న మూవీస్‌ను..సిల్వర్ స్క్రీన్ మీదకు ఎక్కించేందుకు పడరానిపాట్లు పడుతున్నారు ప్రొడ్యూసర్లు.
Also Read : గుండెలు పిండే విషాదం.. కలిచివేస్తున్న సీరియల్ నటులు పవిత్ర, చందుల మరణం