Old Athlete: వయసు 74 ఏళ్ళు.. యువకులతో పరుగు పందెం!

ఇప్పుడు మనుషులు, వారి ఆరోగ్యం గురించి మనం రోజూ వింటూనే ఉంటాం. నిండా యాభై ఏళ్ళు రాకుండానే కీళ్లు నొప్పులు గిఫ్ట్ గా వచ్చేస్తున్నాయి.

Old Athlete: వయసు 74 ఏళ్ళు.. యువకులతో పరుగు పందెం!

Old Athlete

Old Athlete: ఇప్పుడు మనుషులు, వారి ఆరోగ్యం గురించి మనం రోజూ వింటూనే ఉంటాం. నిండా యాభై ఏళ్ళు రాకుండానే కీళ్లు నొప్పులు గిఫ్ట్ గా వచ్చేస్తున్నాయి. యువతీ, యువకులకు కూడా బీపీ, షుగర్లు.. నడిస్తే ఆయాసం, థైరాయిడ్, ఆస్తమా, రక్తహీనత ఇలా ఎన్నెన్నో రోగాలు. ఇక, వయసు మీదపడితే కర్రసాయం, లేదంటే కూర్చున్న చోట నుండే అన్ని పనులు. అలా అయిపొయింది ఇప్పుడు ప్రజల జీవన విధానం. అయితే.. ఓ పెద్దాయన మాత్రం 74 ఏళ్ల వయసులో కూడా చెంగ్ చెంగ్ మని ఎగురుతూ.. కుర్రాళ్లతో పోటీగా పరిగెడుతున్నాడు.

విశాఖపట్నం ప్రహ్లాదపురం దరి విరాట్‌నగర్‌ ప్రాంతానికి చెందిన తాళాబత్తుల వెంకటరమణ(74) అయిదేళ్లలో సుమారు వందకు పైగా పరుగు, నడక పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. విద్యుత్తు శాఖలో పని చేసి ఉద్యోగ విమరణ చేసిన వెంకటరమణ 2016లో 69ఏళ్ల వయసులో వాకర్స్‌ క్లబ్‌లో చేరి ఫిట్నెస్ మీద దృష్టి పెట్టారు. నిత్యం వ్యాయామం, నడక, పరుగు సాధన చేసి 2017 నుంచి పోటీల్లో పాల్గొనడం ప్రారంభించారు.

అలా అయిదేళ్ల వ్యవధిలో వందకు పైగా పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు. విశాఖ, గుంటూరుతో పాటు రాష్ట్రంలో జరిగే పరుగు, నడక పోటీలతో పాటు ఒడిశా, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలలో జరిగే పోటీలలో కూడా పాల్గొన్న వెంకటరమణ వెళ్లిన ప్రతిచోటా తొలి మూడు స్థానాలలోనే ఉంటూ పతకాలు గెలుచుకొనే వస్తున్నారు. పోటీలే కాదు నాటకాల్లో కూడా ప్రవేశం ఉండడంతో ఎక్కడ నాటకాలు జరిగినా అక్కడా ఈయనే ఉంటున్నారు. పరుగులో ఈ పెద్దాయన ప్రతిభ చూసి యువకులు కూడా అసూయ పడుతుంటే.. అందుకే ఆయన్ను వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు పరుగుల బాహుబలి అని పిలుచుకుంటున్నారు.