Anantapur : సరదాగా ఆడాడు.. పబ్ జీ మాయలో తల్లిదండ్రులను మరిచిపోయాడు

బెడ్‌పై ఉన్న బాలుడు చూడ్డానికి బానే కనిపిస్తున్నా.. రెండ్రోజుల వరకు ఎవరినీ గుర్తు పట్టే స్థితిలో లేడు. కన్న తల్లిదండ్రులను కూడా ఎవరు మీరు అన్నాడు.

Anantapur : సరదాగా ఆడాడు.. పబ్ జీ మాయలో తల్లిదండ్రులను మరిచిపోయాడు

Pubg Game

8 Class Boy Addicted Pubg Game : సరదా ఆట ప్రాణాలు తీస్తోంది. మొబైల్‌ గేమ్స్‌ చిన్నారుల పాలిట శాపంలా మారింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది పబ్‌జీ బారినపడి జీవితాలు పణంగా పెడుతున్నారు. వీడియోగేమ్‌లకు ఆడిక్టయి చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో ఓ విద్యార్థి ప్రాణం మీదికి తెచ్చింది. పబ్‌జీ ఆడుతూ స్పృహ కోల్పోయాడు. బెడ్‌పై ఉన్న బాలుడు చూడ్డానికి బానే కనిపిస్తున్నా.. రెండ్రోజుల వరకు ఎవరినీ గుర్తు పట్టే స్థితిలో లేడు. కన్న తల్లిదండ్రులను కూడా ఎవరు మీరు అన్నాడు. ఈ పరిస్థితి తీసుకొచ్చింది పబ్‌జీ గేమ్. తనను తాను మర్చిపోయి గేమ్‌లో మునిగిపోవడంతో కన్నవారినే గుర్తు పట్టలేని స్థితికి వెళ్లాడు.

Read More : Gun Misfire : ట్రెజరీ ఆఫీసులో గన్ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ పరిస్థితి విషమం

పెద్దవడుగూరు మండలానికి చెందిన బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ప్రతీ రోజూ గంటల తరబడి సెల్‌ఫోన్‌లో… వీడియో గేమ్‌లు ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. మూడు నెలల నుంచి రాత్రుళ్లు అదేపనిగా పబ్‌జీ ఆడుతూ ఓ రోజు ఇంట్లో ఆకస్మాత్తుగా కిందపడిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత ఎవరినీ గుర్తుపట్టలేదు. ప్రస్తుతం కర్నూలులోని అమిలీయా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు బాలుడు. తన కుమారుడి పరిస్థితి చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Read More : Corona Variant: 13మంది విదేశీ ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్

ఇలా ఈ బాలుడి పరిస్థితి ఒక్కడిదే కాదు…గతంలోనూ ఎంతో మంది ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. చెన్నైలో ఓ బాలుడు మొబైల్ వీడియో గేమ్‌కు అడిక్ట్‌ అయి ఆసుపత్రిలో చేరాడు. బెడ్‌పై కూడా గేమ్‌ ఆడుతున్నట్టు చేతులు ఆడిస్తూ ఉన్నాడు. కొన్ని రోజుల చికిత్స తర్వాత కోలుకున్నాడు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం రాజారాం పల్లెకు చెందిన 20 ఏళ్ల కుర్రాడు అదే పనిగా పబ్‌జీ గేమ్ ఆడాడు. 45 రోజులుగా పబ్‌జీ గేమ్ ఆడుతూనే ఉన్నాడు. దీంతో అతని మెడ నరాలు పట్టేశాయి. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించిన లాభం లేకుండా పోయింది. చివరకు ప్రాణాలు విడిచాడు.

Read More : Last Rites Rosaiah : ఇక సెలవు..రోశయ్య అంత్యక్రియలు పూర్తి

మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు. ఆటలో మునిగిపోయి ఉండగా వారిని రైలు ఢీ కొట్టింది. ట్రాక్‌ పక్కన బైక్‌ను ఉంచి పట్టాలపై కూర్చుని పబ్‌జీ ఆడతుండగా వారిని రైలు ఢీ కొనడంతో చనిపోయారు. వర్చువల్‌ వరల్డ్‌లో విహరిస్తున్నామంటూ అంటూ చుట్టు పక్కల ఏం జరుగుతుందో తెలియకుండా చేస్తోంది. అందులో మునిగిపోయి అన్ని వదులుకుంటున్నారు. ఎంత వారించినా మానడం లేదు. ఇలా చిన్నారులే కాదు…కొంత మంది యువకులు కూడా….వీడియో గేమ్‌లకు అలవాటు పడి కష్టాలు కొనితెచ్చుకున్నారు. కాసేపు ఆడితే ఏం కాకపోవచ్చు…కానీ గంటల తరబడి అందులోనే ఉంటే మాత్రం దూరం పెట్టాల్సిందేనంటున్నారు వైద్యులు.