Last Rites Rosaiah : ఇక సెలవు..రోశయ్య అంత్యక్రియలు పూర్తి

మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. కొంపల్లి ఫామ్ హౌస్ లో 2021, డిసెంబర్ 05వ తేదీ ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.

Last Rites Rosaiah : ఇక సెలవు..రోశయ్య అంత్యక్రియలు పూర్తి

Rosaiah

Last rites of Konijeti Rosaiah : మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. మేడ్చల్…దేవరయాంజాల్ ఫామ్ హౌస్ లో 2021, డిసెంబర్ 05వ తేదీ ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛానాలతో ఈ కార్యక్రమం జరిగింది. రోశయ్య కుటుంబసభ్యులు, అభిమానులు, కాంగ్రెస్ నేతలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన అంత్యక్రియలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, అభిమానులు హాజరయ్యారు. అంతకుముందు…కొణిజేటి రోశయ్య పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉదయం 10 గంటల నుంచి గాంధీభవన్‌లో ఉంచారు. అనంతరం దేవరయాంజల్ లోని వ్యవసాయక్షేత్రానికి తరలించారు. తెలంగాణ ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించగా.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా శనివారం నుంచి సోమవారం వరకు సంతాప దినాలుగా పాటిస్తున్నట్లు వెల్లడించింది.

Read More : Omicron Corona Virus : తెలంగాణలో ఓమిక్రాన్ వార్తలపై హెల్త్ డైరెక్టర్ కీలక ప్రకటన

సీఎం కేసీఆర్ తో సహా పలువురు నివాళులు :-
మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య 2021, డిసెంబర్ 04వ తేదీ శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. రోశయ్య వయసు 88 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రోశయ్య ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, ఇతరులు దిగ్ర్భాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఆయన భౌతికకాయానికి సీఎం కేసీఆర్ తో సహా..వివిధ పార్టీలకు చెందిన నేతలు నివాళులర్పించారు. ఆయనకు భార్య శివలక్ష్మి, ముగ్గురు కుమారులు శివ సుబ్బారావు, త్రివిక్రమరావు, శ్రీమన్నారాయణమూర్తి, కుమార్తె రమాదేవి ఉన్నారు.

Read More : Pushpa : ‘పుష్ప’ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నా అంటున్న జెనీలియా భర్త

1933 లో జననం :-
కొణిజేటి రోశయ్య… సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం , రాజకీయల్లో తలపండిన నేతగా గుర్తింపు, రాష్ట్రంలో దీర్ఘ కాలంపాటు ఆర్ధిక శాఖను ఒంటి చేత్తో నడిపిన నేర్పరితనం, ప్రత్యర్ధులపై చమత్కారాలతో ఇరుకున పెట్టే నైపుణ్యం, రాజకీయల్లో ఉద్దండుడిగా గుర్తింపు ఇలా అనేక కోణాల్లో ఒక రాజకీయ నేతకు గుర్తింపు రావడం చాలా అరుదు. కానీ సామాన్యుడిగా మొదలై అసామాన్యుడుగా రాజకీయల్లో ఎదిగిన మాజీ ముఖ్యమంత్రి గా కన్నా మాజీ ఆర్ధిక మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు రోశయ్య. గుంటూరు జిల్లా వేమూరులో 1933 జూలై 4న ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించిన రోశయ్య, 5వ తరగతి వరకు వేమూరులో.. ఆ తరువాత పక్కనే ఉన్న పేరవలిలో 8వ తరగతి వరకు… కొల్లూరులో 10వ తరగతి వరకు చదువుకున్నారు. కొల్లూరులో చదువుకునే రోజుల్లోనే నాదెండ్ల భాస్కరరావు, ఆలపాటి ధర్మారావు లాంటి వారు తనకు తోటి విధ్యార్ధులుగా ఉండటంతో వారితో స్నేహం ఏర్పడింది. ఆ తరువాత గుంటూరు పున్నారావు వైశ్య హాస్టల్ లో ఉంటు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు.

Read More : Petrol Coupon : ట్రాఫిక్ నిబంధనలు పాటించండి..ఫ్రీగా పెట్రోల్ పొందండి

శాసనమండలి బరిలో :-
గుంటూరులోని హిందూ కాలేజిలో చదువుతున్న రోజుల్లోనే ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం జరుగుతున్న సంధర్భంలో రాజకీయాల వైపు మొగ్గు చూపిన రోశయ్య విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, రైతు నాయకుడు ఎన్.జి.రంగా ప్రతి వేసవి కాలంలో నిర్వహించే రైతు సదస్సులుకు హాజరయి అక్కడ వక్తగా రోశయ్య వ్యవహరించడంతో అనతికాలంలోనే రంగాకి శిష్యులుగా మారారు. 1959లో స్వతంత్ర పార్టీ ఆవిర్భావంలో రంగాతోపాటు రోశయ్య కూడా పాలుపంచుకున్నారు. ముప్పై ఏళ్ళ వయస్సులోనే రోశయ్య తొలిసారి 1962 ఎన్నికల్లో తెనాలి శాసనసభకు స్వతంత్ర పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. రెండో ప్రయత్నంలో 1967 ఎన్నికల్లో చీరాల నుండి ఇండిపెండెంట్ గా పొటీకి దిగి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యరు. ఆ తరువాత 1968లో స్వతంత్ర పార్టీకి ఏడుగురే శాసన సభ్యులున్నా గౌతు లచ్చన్న తోడ్పాటుతో శాసన మండలి బరిలోకి దిగిన రోశయ్యకు కాంగ్రెస్ శాసన సభ్యులతో మంచి సంబంధాలు ఉండటంతో గెలుపొందారు.

Read More : IIT-Kharagpur : స్టూడెంట్లకు బంపర్ ఆఫర్..ఖరగ్ పూర్ ఐఐటీ..ఏడాదికి రూ. 2 కోట్ల ప్యాకేజీ

జలగం వెంగళరావుకు సన్నిహితులు :-
1971లో కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెస్ లోకి వచ్చిన రోశయ్య, 1974 వచ్చేసరికి అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళ రావుకి సన్నిహితంగా మారారు.. ఆ తరువాత జరిగిన శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున జలగం వెంగళ రావు ఎంత ప్రయత్నించిన రోశయ్యకు టిక్కెట్ట్ ఇప్పించుకోలేకపోయే సరికి ఇండిపెండెంట్ గా పోటీలోకి దిగి వెంగళరావు మరికొంత మంది సభ్యుల సహకారంతో తిరిగి మండలికి ఎన్నికయ్యారు. 1978లో కాంగ్రెస్ పార్టీలో చీలిక ఏర్పడిన నేపధ్యంలో ప్రజలందరూ ఇందిరా గాంధి వైపే మొగ్గు చూపుతున్నారు అని తెలిసినప్పటికి కాసు బ్రహ్మనందరెడ్డి, జలగం వెంగళరావు పైన తనకున్న అందులోనే ఉండిపోయారు. అయితే 1978లో ఇందిరా కాంగ్రెస్ తరుపున చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అవ్వగా శాసన మండలిలో రోశయ్య ప్రతిపక్షనేత పాత్ర పోషించారు. ఆ తరువాత చెన్నారెడ్డి రోశయ్యను తమ పార్టీ లోకి రమ్మని ఆహ్వానించగా 1979 మేలో కాంగ్రెస్ ఐలో చేరిపోయారు. ఈ చేరికతో రోశయ్యకు చెన్నారెడ్డి కెబినేట్ లో రహదారులు భవనాల శాఖ మంత్రిపదవి దక్కడంతో ఆయన రాజకీయ ప్రస్థానంలో అదొక కీలక పరిణామంగా నమోదైంది. ఆ తరువాత అంజయ్య కేబినెట్ లో హౌసింగ్, రవాణా శాఖలకి మంత్రిగా వ్యవహరించారు రోశయ్య.

Read More : Nagaland Firing : నాగాలాండ్ లో ఆర్మీ కాల్పులు..13 మందికి చేరిన మృతుల సంఖ్య

వైఎస్ తో ప్రత్యేక బంధం :-
ఇక రోశయ్యకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న బంధం ప్రత్యకమైందనే చెప్పాలి. వైఎస్ఆర్‌ 1999లో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు శాసన సభలో వీరిరువురూ ప్రధాన పక్షాన్ని ఇరుకున పెట్టేవారు. 2004లో వైఎస్ పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో చీరాల నుండి పోటీ చేసి ఘన విజయం సాదించిన రోశయ్య… వైఎస్ కేబినెట్ లో ఆర్ధిక మంత్రిగా భాద్యతలు చేపట్టి శాసన సభలో నెంబర్ 2గా వ్యవహరించారు.. 2009లో రోశయ్య తాను ఇక శాసన సభకు పోటీ చేయదలుచుకోలేదు అని చెప్పిన మరుక్షణం రోశయ్య చేత మంత్రి పదవికి శాసన సభకు రాజీనామా చేయించి మండలికి ఎంపిక చేశారు. ఆ తరువాత 2009లో ఎన్నికలలో విజయం సాధించాక రోశయ్యను వైఎస్ యదావిధిగా ఆర్థిక మంత్రిగా కొనసాగించారు.

Read More : Puneeth Rajkumar Family : పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన పెద్దిరెడ్డి

సీఎంగా కొద్ది రోజులు : –
వైఎస్‌ మరణానతరం అదిష్టానం ఆదేశాలమేరకు అనూహ్యమైన పరిణామాలతో ముఖ్యమంత్రి అయిన రోశయ్య ఉన్నది కొద్ది రోజులైనా అనేక ఇబ్బందుల మధ్యనే ఆ పదవిలో కొనసాగారు. చివరికి అధిష్టానం ముఖమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేయడంతో 2011 ఆగస్టు 31న తమిళ నాడు గవర్నర్ గా వెళ్ళారు. 2014 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి పాలై నరెంద్ర మోడి అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ నియమించిన గవర్నర్లను అనేక చోట్ల తొలగించి వేరే వారిని నియమిస్తే తమిళనాడులో మాత్రం కాంగ్రెస్ వ్యక్తి అయిన రోశయ్యను మాత్రం తొలగించకుండా కొనసాగించారు. దీనికి ప్రధాన కారణం వివాద రహితంగా తమిళనాడులో పేరు తెచ్చుకోవడమే. 2016లో తమిళనాడు గవర్నర్ గా పదవి విరమణ చేశారు. ఐదుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా, ఆ తరువాత ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా అనేక పదవులు చేపట్టిన ఆయన సుదీర్గ రాజకీయ ప్రస్థానంలో దురందరుడిగా పేరు గడించారు. ఆర్ధిక శాఖ అంటే నాకు అత్యంత ఇష్టమైన సబ్జెక్టు అని ప్రకటించుకున్న ఆయన ఏకంగా 15 సార్లు బడ్జేట్ ప్రవేశపెట్టిన నేతగా గుర్తింపు పొందారు, ఈ క్రమంలో వరుసుగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేతగా కూడా రికార్డు సృష్టించారు. అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం చూపడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దిగాలు పడటం ఎరుగని నేతగా గుర్తింపు పొందారు రోశయ్య.