Andhra Pilgrims: అమర్‌నాథ్‌లో 84 మంది ఏపీ యాత్రికులు సురక్షితం

రెండు రోజుల క్రితం అమర్‌నాథ్‌లో కుంభ వృష్టి కురిసిన సంగతి తెలిసిందే. దీని వల్ల వరద ముంచెత్తి 17 మంది మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారు. మరికొంతమంది గల్లంతయ్యారు. ప్రస్తుతం అక్కడ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.

Andhra Pilgrims: అమర్‌నాథ్‌లో 84 మంది ఏపీ యాత్రికులు సురక్షితం

Andhra Pilgrims

Andhra Pilgrims: అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యాత్రికుల్లో 84 మంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఇద్దరు మహిళల జాడ మాత్రం ఇంకా తెలియలేదు. ముందుగా ప్రభుత్వం ఏపీకి చెందిన ఐదుగురు యాత్రికుల సమాచారం తెలియలేదని వెల్లడించింది. అయితే, వీరిలో ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు తేలింది.

Red Alert: ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ

రెండు రోజుల క్రితం అమర్‌నాథ్‌లో కుంభ వృష్టి కురిసిన సంగతి తెలిసిందే. దీని వల్ల వరద ముంచెత్తి 17 మంది మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారు. మరికొంతమంది గల్లంతయ్యారు. ప్రస్తుతం అక్కడ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం అధికారులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అమర్‌నాథ్‌ యాత్రలో సురక్షితంగా ఉన్న ఏపీ వాసులను అధికారులు సంప్రదించారు. అలాగే వారి కుటుంబీకులు కూడా మాట్లాడారు. ఏపీలోని రాజమహేంద్ర వరం నుంచి 20 మంది యాత్రికుల బృందం అమర్‌నాథ్‌ వెళ్లింది. ఈ బృందానికి చెందిన ఇద్దరు మహిళల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఆ మహిళల భర్తలు మాత్రం శ్రీ నగర్ చేరుకున్నారు.

Terrorists: నాలుగేళ్లలో 700 మంది.. జమ్మూలో తీవ్రవాదుల్లో చేరిన యువత

వారిద్దరూ గాయపడి ఉండటమో లేదా మరో చోటికి వెళ్లి ఉండటమో జరగొచ్చని ఒక అధికారి తెలిపారు. గుంటూరు నుంచి వెళ్లిన 38 మంది భక్తుల బృందం, తాడేపల్లి గూడెం నుంచి వెళ్లిన 17 మంది బృందం, తిరుపతి నుంచి వెళ్లిన 6గురు భక్తుల బృందం, ఇతర ప్రాంతాల నుంచి వెళ్లిన మరికొంత మంది సురక్షితంగా ఉన్నారు. ఏపీకి చెందిన భక్తులకు సహాయం చేసేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారిని శ్రీనగర్ పంపించారు. భక్తుల సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం 1902 హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది.