Terrorists: నాలుగేళ్లలో 700 మంది.. జమ్మూలో తీవ్రవాదుల్లో చేరిన యువత

లష్కర్ ఎ తయిబా, జైషే మహ్మద్, హిజ్జుల్ ముజాహిద్దీన్ తీవ్రవాద గ్రూపులకు చెందిన తీవ్రవాదులే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి అనేక తీవ్రవాద సంస్థలు నాలుగేళ్లలో 700 మంది యువతను తమ గ్రూపుల్లో చేర్చుకున్నాయి.

Terrorists: నాలుగేళ్లలో 700 మంది.. జమ్మూలో తీవ్రవాదుల్లో చేరిన యువత

Terrorists

Terrorists: జమ్ము-కాశ్మీర్‌ ప్రాంతంలో తీవ్రవాదుల గ్రూపులో చేరే యువకుల సంఖ్య భారీగా ఉంది. కేంద్ర హోం శాఖ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం నాలుగేళ్లలో జమ్ము-కాశ్మీర్‌ ప్రాంతంలో 700 మంది యువత తీవ్రవాద గ్రూపుల్లో చేరింది. వీరిలో ప్రస్తుతం 141 మంది టెర్రరిస్టులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది విదేశీయులే. 82 మంది విదేశీయులు కాగా, 59 మంది స్థానికులు ప్రస్తుతం తీవ్రవాద కార్యకలాపాల్లో యాక్టివ్‌గా ఉన్నారు.

Red Alert: ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ

సరిహద్దుదాటి తీవ్రవాదులు ఇండియాలోకి రావడం వల్లే తీవ్రవాదుల సంఖ్య ఎక్కువగా ఉంది. లష్కర్ ఎ తయిబా, జైషే మహ్మద్, హిజ్జుల్ ముజాహిద్దీన్ తీవ్రవాద గ్రూపులకు చెందిన తీవ్రవాదులే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి అనేక తీవ్రవాద సంస్థలు నాలుగేళ్లలో 700 మంది యువతను తమ గ్రూపుల్లో చేర్చుకున్నాయి. 2018లో 187 మంది, 2019లో 121 మంది, 2020లో 181 మంది, 2021లో 142 మంది ఈ గ్రూపుల్లో చేరారు. ఈ ఏడాది జూన్ చివరి వరకు మొత్తం 69 మంది యువత తీవ్రవాద గ్రూపుల్లో చేరారు. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన 55 ఎన్‌కౌంటర్లలో 125 మంది టెర్రరిస్టులు మరణించారు. వీరిలో 91 మంది స్థానికులు కాగా, 34 మంది విదేశీయులు. 123 మంది తీవ్రవాదుల్ని భద్రతా దళాలు పట్టుకున్నాయి. వీరి నుంచి భారీస్థాయలో ఆయుధాలు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

Assam: మహిళ హత్య.. నిందితుడిని కాల్చి చంపిన గ్రామస్తులు

భద్రతా దళానికి చెందిన ఇద్దరు మరణించగా, 23 మంది గాయపడ్డారు. తీవ్రవాదుల దాడుల్లో ఇరవై మంది పౌరులు మరణించారు. 2018లో 185 మంది తీవ్రవాదులు, 72 మంది పౌరులు, ఏడుగురు భద్రతా సిబ్బంది, 2019లో 148 మంది తీవ్రవాదులు, 49 మంది భద్రతా సిబ్బంది, 46 మంది పౌరులు, 2020లో 215 మంది తీవ్రవాదులు, 19 మంది భద్రతా సిబ్బంది, 38 మంది పౌరులు, 2021లో 146 మంది తీవ్రవాదులు, ముగ్గురు భద్రతా సిబ్బంది, 41 మంది పౌరులు మరణించినట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది.