Anantapur Lok Sabha constituency: పవన్ కల్యాణ్‌ను పోటికి దించుతారా.. కొత్త ముఖాలేమైనా బరిలోకి దిగబోతున్నాయా?

Anantapur Lok Sabha constituency: అనంతపురం.. ఆ పేరులో ఓ బేస్ ఉంటుంది. అక్కడి రాజకీయంలో హీట్ ఉంటుంది. మరి.. ఈసారి ఎన్నికల్లో.. అక్కడ ఛేంజ్ ఉంటుందా? దీనిమీదే.. ఇప్పుడు అనంతలో సీరియస్ డిబేట్ నడుస్తోంది.

Anantapur Lok Sabha constituency: పవన్ కల్యాణ్‌ను పోటికి దించుతారా.. కొత్త ముఖాలేమైనా బరిలోకి దిగబోతున్నాయా?

Anantapur Lok Sabha constituency: అనంతపురం.. ఆ పేరులో ఓ బేస్ ఉంటుంది. అక్కడి రాజకీయంలో హీట్ ఉంటుంది. మరి.. ఈసారి ఎన్నికల్లో.. అక్కడ ఛేంజ్ ఉంటుందా? దీనిమీదే.. ఇప్పుడు అనంతలో సీరియస్ డిబేట్ నడుస్తోంది. ఒకప్పటి తమ చుకోట అయిన అనంతపురం పార్లమెంటులో.. మళ్లీ పసుపు జెండా ఎగరేయాలని టీడీపీ చూస్తుంటే.. సిట్టింగ్ సీటును నిలుపుకొని.. ఇంకా తమను కొట్టేవాళ్లు.. ఇప్పట్లో రాలేరని చెప్పాలని వైసీపీ చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. వచ్చే ఎన్నికల కోసం పార్టీలు ఎలాంటి వ్యూహాలు రెడీ చేస్తున్నాయ్? అభ్యర్థులు మారే అవకాశం ఏమైనా ఉందా? కొత్త ముఖాలేమైనా బరిలోకి దిగబోతున్నాయా?


అనంతలో మళ్లీ పసుపు జెండా ఎగరేయాలని చూస్తున్న టీడీపీ

అనంతపురం పార్లమెంట్ స్థానం పరిధిలో.. రాజకీయం ఎప్పుడెలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. ఇక్కడి ఓటర్ల పల్స్ పట్టుకోవడం అంత ఈజీ వ్యవహారమేమీ కాదు. మేమే గెలుస్తామనే విశ్వాసంతో బరిలోకి దిగిన పార్టీల్లో.. ఫలితాల్లో బొక్క బోర్లా పడిన సీన్లు చాలానే ఉన్నాయ్. 1952లో అనంతపురం పార్లమెంట్ స్థానం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు.. ఎన్నో సార్లు ఎన్నికలు జరిగాయ్. వాటిలో ఎక్కువగా గెలిచింది కాంగ్రెస్ అభ్యర్థులే. మధ్యలో అప్పుడప్పుడు.. తెలుగుదేశం క్యాండిడేట్లు ఓ 3 సార్లు గెలిచారు. ఫస్ట్ టైమ్.. 2019 ఎన్నికల్లో అనంతపురం పార్లమెంట్ స్థానంలో వైసీపీ జెండా ఎగిరింది. గత ఎన్నికల్లో.. ఈ స్థానంలో టీడీపీకి తిరుగులేదని భావించినా.. వైసీపీ బీసీ అభ్యర్థిని బరిలోకి దించి చేసిన ప్రయోగం అఖండమైన విజయాన్ని సాధించిపెట్టింది. అంతే.. దెబ్బకు అనంతలో పొలిటికల్ సీనే మారిపోయింది. అందువల్ల.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని వైసీపీ.. మళ్లీ పసుపు జెండా ఎగరేయాలని టీడీపీ.. ఎత్తుకు పైఎత్తులు సిద్ధం చేస్తున్నాయ్. ఇప్పటి నుంచే బలాబలాలను బేరీజు వేసుకుంటున్నాయ్.


కళ్యాణదుర్గం నుంచి పోటీకి ఎంపీ తలారి రంగయ్య ప్రయత్నాలు

ప్రస్తుతం.. వైసీపీ నుంచి అనంతపురం సిట్టింగ్ ఎంపీగా తలారి రంగయ్య ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో.. కళ్యాణదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే.. బలమైన సామాజికవర్గానికి చెందిన నేతగా ఉన్న రంగయ్య.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే.. మళ్లీ అంతే బలమైన అభ్యర్థిగా.. వైసీపీ ఎవరిని బరిలోకి దించుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. వైసీపీకి విజయావకాశాలు మెరుగ్గానే ఉన్నా.. పోటీ చేసే అభ్యర్థిని బట్టే గెలుపోటములు డిసైడ్ అవుతాయనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి బలమైన బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని టీడీపీ భావిస్తోంది. ఇందుకోసం.. సామాజిక వర్గాల వారీగా లెక్కలు వేసుకుంటోంది. టీడీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ అయిన జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి.. రాబోయే ఎన్నికల్లో అనంతపురం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దాంతో.. బోయ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులును ఎంపీగా పోటీ చేయించాలని.. టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా ఎంపీగా పోటీ చేయడంపై విముఖంగానే ఉన్నా.. ఎలాగైనా ఒప్పించి పోటీ చేయించేందుకు టీడీపీ కసరత్తు చేస్తోందని సమాచారం.


ప్రభాకర్ చౌదరి, జేసీ పవన్ రెడ్డి గ్రూపులతో కేడర్ సతమతం

అనంతపురము పార్లమెంట్ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయ్. అవి.. రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, అనంతపురం, తాడిపత్రి, శింగనమల, కల్యాణదుర్గం. అనంతపురం అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికొస్తే ఇక్కడ వైసీపీ బలంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి.. తనదైన శైలిలో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంతో.. వైసీపీని జనంలోకి తీసుకెళ్లడంలో ఆయన ముందున్నారు. ఇదే స్థానంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మరోవైపు జేసీ పవన్ రెడ్డి గ్రూపులతో టీడీపీ కేడర్ సతమతమవుతోంది. గత ఎంపీ ఎన్నికల్లో ఓటమిపాలైన జేసీ పవన్ కుమార్ రెడ్డి.. అనంతపురం అసెంబ్లీ టికెట్ తనదేనని జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. టీడీపీ మాత్రం జనసేనతో పొత్తు కుదిరితే.. అక్కడి నుంచి జనసేనాని పవన్ కల్యాణ్‌ను పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


శింగనమల టీడీపీలో ఎక్కువైన గ్రూపు పాలిటిక్స్

అనంతపురం పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏకైక ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్ శింగనమల. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో.. అదే పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందనే సెంటిమెంట్ ఉంది. అది పక్కనబెడితే.. ఇక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జొన్నలగడ్డ పద్మావతి పరిస్థితి అయోమయంగా ఉంది. ఎమ్మెల్యే భర్త ఆలూరు సాంబశివారెడ్డి.. ప్రభుత్వ సలహాదారుగా, రాష్ట్ర విద్యా కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇంట్లో.. ఇద్దరు పదవుల్లో ఉన్నా.. నియోజకవర్గానికి పెద్దగా చేసిందేమీ లేదనే విమర్శలున్నాయ్. అయితే.. సీఎం జగన్‌తో ఉన్న సన్నిహత సంబంధాలే.. తమకు టికెట్ తెచ్చిపెడతాయన్న ధీమాతో ఉన్నారు. ఇక.. టీడీపీలో గ్రూపు పాలిటిక్స్ ఎక్కువయ్యాయ్. జేసీ బ్రదర్స్ వర్గంలో ఉన్న బండారు శ్రావణి.. పార్టీ కార్యక్రమాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉన్నారు. అయితే.. అధిష్టానం టూ మ్యూన్ కమిటీ వేసి గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోసింది. ఇప్పటికైనా.. బండారు శ్రావణికి పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తే.. విజయం సాధించే అవకాశాలున్నాయని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కొత్త అభ్యర్థులను బరిలోకి దించుతాయనే ప్రచారం కూడా సాగుతోంది.



తాడిపత్రిలో టీడీపీ-వైసీపీ మధ్య నువ్వా-నేనా అనే పోటీ

ఇక.. జేసీ బ్రదర్స్ కంచుకోటగా ఉన్న తాడిపత్రి సెగ్మెంట్‌లో.. గత ఎన్నికల్లో వైసీపీ విక్టరీ జిల్లా మొత్తం రీసౌండ్ వచ్చింది. ప్రస్తుతం.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు. క్యాడర్ మొత్తాన్ని సమన్వయం చేసుకుంటూ.. నియోజకవర్గంలో వైసీపీని బలంగా మార్చారనే పేరుంది. అయినప్పటికీ.. తాడిపత్రి మున్సిపాలిటీలో జేసీ బ్రదర్స్ టీడీపీ జెండా ఎగరేశారు. అప్పటి నుంచి సవాళ్ల రాజకీయం నడుస్తూనే ఉంది. 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన జేసీ అస్మిత్ రెడ్డి.. అప్పుడప్పుడు మాత్రమే నియోజకవర్గంలో కనిపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ అంతగా యాక్టివ్‌గా లేరనే టాక్ క్యాడర్‌లో వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో.. తాడిపత్రిలో టీడీపీ-వైసీపీ మధ్య నువ్వా-నేనా అనే స్థాయిలోనే పోటీ ఉంటుందని చెబుతున్నారు. రెండు పార్టీల నుంచి ఎవరిని అభ్యర్థులుగా బరిలోకి దించుతారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. Also Read: అనంతపురంలో హైటెన్షన్.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ


గుంతకల్ టికెట్ కోసం టీడీపీలో తీవ్రంగా పోటీ

బీసీ సామాజికవర్గానికి కుంచుకోటగా ఉన్న గుంతకల్‌లో.. వైసీపీ నుంచి వెంకటరామిరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో ఆయన కుటుంబపాలన సాగిస్తున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయ్. గుంతకల్‌ సెగ్మెంట్‌లో.. సంక్షేమ పథకాలతో వైసీపీ ప్రభుత్వం ముందుకెళుతున్నా.. ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి పనితీరే సరిగా లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో.. గుంతకల్‌ నుంచి వైసీపీ కొత్త అభ్యర్థిని బరిలోకి దించే అవకాశాలున్నాయని.. పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సెగ్మెంట్‌లో.. టీడీపీ పరిస్థితి బాగానే ఉన్నట్లనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ఆరోగ్యం సహకరించకపోయినా.. ప్రజల్లో తిరుగుతూ.. వైసీపీపై పోరాటం చేస్తూ.. క్యాడర్‌లో జోష్ తగ్గకుండా చూసుకుంటున్నారు. అయినప్పటికీ.. టీడీపీ నుంచి గుంతకల్ టికెట్ కోసం పోటీ ఎక్కువగానే ఉంది. వీళ్లలో.. అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందనేది ఆసక్తిగా మారింది.


ఉరవకొండ వైసీపీలో హాట్ టాపిక్‌గా 3 గ్రూపులు

ఉరవకొండకూ.. ఓ సెంటిమెంట్ ఉంది. ఇక్కడ.. ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో.. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం కోల్పోతుంది. 1983 ఎన్నికలు మినహాయిస్తే.. తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ఇదే రిపీట్ అయింది. 2014లో ఇక్కడ వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు.. టీడీపీ అధికారం చేపట్టింది. గత ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ కోసం మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. జనంతో మమేకమవుతూ.. నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. అయితే.. ఉరవకొండ వైసీపీలో 3 గ్రూపులున్నాయ్. విశ్వేశ్వర రెడ్డికి తమ్ముడు ముసూధన్ నుంచే పోటీ ఎదురవుతోంది. అలాగే.. ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వర్గం కూడా తయారైంది. అధిష్టానం దృష్టి పెట్టి.. ఈ గ్రూపుల మధ్య సయోధ్య కుదిర్చితేనే.. వైసీపీ గెలిచే అవకాశాలుంటాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ విషయానికొస్తే.. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నాయకత్వంలో టీడీపీ బలంగానే కనిపిస్తున్నా ఎన్నికల నాటికి పరిస్థితులు మారే చాన్స్ ఉందంటున్నారు. ఇక్కడ.. రెండు పార్టీలు బలంగానే ఉన్నా.. మెజారిటీ మాత్రం 2 నుంచి 3 వేల లోపే ఉంటోంది. దాంతో.. రెండు పార్టీలు గెలుపు కోసం నువ్వా-నేనా అనే స్థాయిలోనే పోటీ పడతాయన్నది మాత్రం క్లియర్. Also Read: YS జగన్‌‌పై దాడిచేసిన ‘ఆకోడి కత్తి’ ఎక్కడుంది?


కల్యాణదుర్గంలో అమోమయంగా టీడీపీ పరిస్థితి

తెలుగుదేశం కంచుకోట కల్యాణదుర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరేసింది. వైసీపీ నుంచి.. మంత్రి ఉషా శ్రీచరణ్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. మంత్రి పదవి వచ్చాక.. ఆవిడ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే టాక్ వినిపిస్తోంది. పైగా.. ఎంపీ తలారి రంగయ్య, మంత్రి ఉషా శ్రీచరణ్ మధ్య మొదటి నుంచి విభేదాలున్నాయ్. సిట్టింగ్ ఎంపీ రంగయ్య ఈసారి కల్యాణదుర్గం నుంచే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దాంతో.. ఇద్దరిలో వైసీపీ టికెట్ ఎవరికిస్తుందన్నది సస్పెన్స్‌గా మారింది. ఇదే సెగ్మెంట్‌లో టీడీపీ పరిస్థితి అమోయమంగా ఉంది. ఒకప్పుడు పార్టీకి కంచుకోటగా ఉన్న స్థానంలో.. పార్టీ ఉనికే ప్రశ్నార్థంగా మారిందని కార్యకర్తలు అంటున్నారు. ఇక్కడ కూడా గ్రూప్ పాలిటిక్స్ చర్చనీయాంశంగా మారాయ్. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి వర్గం, పార్టీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడి వర్గం.. విడివిడిగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాయ్. ఇప్పటికైనా.. అధిష్టానం దృష్టి సారించి.. ఎవరో ఒకరికి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించి.. గ్రూప్ పాలిటిక్స్‌కి చెక్ పెట్టాలని క్యాడర్ కోరుతోంది. లేకపోతే.. మరోసారి ఓటమి చవిచూడక తప్పదంటున్నారు.

 
రాయదుర్గం నుంచి వైసీపీ కొత్త అభ్యర్థిని దించే అవకాశం

రాయదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికొస్తే.. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాపు రామచంద్రారెడ్డి ఉన్నారు. ఆయన ప్రభుత్వ విప్‌గాను కొనసాగుతున్నారు. అయితే.. ఆయన పెద్దగా ప్రజలకు అందుబాటులో ఉండరనే టాక్ వినిపిస్తోంది. కాపు రామచంద్రారెడ్డి.. కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారనే చర్చ జరుగుతోంది. అందుకే.. నియోజకవర్గంపై దృష్టి పెట్టలేకపోతున్నారని అంటున్నారు. ఈ విషయం.. సీఎం జగన్‌కూ కూడా తెలుసనే టాక్ వినిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లోనూ అప్పుడప్పుడు పాల్గొంటున్నారు. అందువల్ల.. వచ్చే ఎన్నికల్లో రాయదుర్గం నుంచి వైసీపీ కొత్త అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఇదే సెగ్మెంట్‌లో టీడీపీ బలంగానే కనిపిస్తోంది. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు.. జనంలో ఉంటూ.. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. అయితే.. తెలుగుదేశం అధిష్టానం మాత్రం.. కాలవ శ్రీనివాసులుని.. అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దించాలని చూస్తున్నట్లు సమాచారం. కానీ.. ఆయన మాత్రం రాయదుర్గం నుంచి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని క్లియర్‌గా చెప్పేశారనే ప్రచారం జరుగుతోంది. మరి.. ఎన్నికల నాటికి ఆయన్ని ఎంపీగా పోటీ చేసేందుకు తెలుగుదేశం నాయకత్వం ఒప్పిస్తుందా? లేక.. రాయదుర్గం టికెట్ ఇచ్చి.. అసెంబ్లీ బరిలోనే దించుతుందా అనేది.. ఆసక్తిగా మారింది.

2014 ఎన్నికల్లో.. తెలుగుదేశం అనంతపురం ఎంపీ స్థానంతో పాటు దాని పరిధిలో ఉన్న 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలిచింది. అప్పుడు.. వైసీపీ ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది. 2019 ఎన్నికలొచ్చేసరికి.. సీన్ రివర్స్ అయింది. గత ఎన్నికల్లో వైసీపీ అనంతపురం పార్లమెంట్ సీటుతో పాటు దాని పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది. మరి.. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సీన్ కనిపించబోతుందన్నదే సస్పెన్స్‌గా మారింది. అధికార వైసీపీ.. అనంత ఎంపీ సీటుతో పాటు మెజారిటీ అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటుందా? లేక.. తెలుగుదేశం ఈసారి వైసీపీని గట్టిగా ఎదుర్కొని.. పసుపు జెండా పాతుతుందా? అనేది మరింత ఆసక్తిగా మారింది.