Anantapur Tension : అనంతపురంలో హైటెన్షన్.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ

అనంతపురం క్లాక్ టవర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా వార్ తో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. గుంటూరుకు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. తాను రాప్తాడుకు వచ్చానంటూ వైసీపీ మద్దతుదారుడు కామెంట్ చేయడంతో..

Anantapur Tension : అనంతపురంలో హైటెన్షన్.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ

Updated On : March 6, 2023 / 6:52 PM IST

Anantapur Tension : అనంతపురం క్లాక్ టవర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా వార్ తో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. గుంటూరుకు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు ఉద్రిక్తతలకు కారణమయ్యాయి.

తాను రాప్తాడుకు వచ్చానంటూ వైసీపీ మద్దతుదారుడు కామెంట్ చేయడంతో.. ఇటు టీడీపీ, అటు వైసీపీ మద్దతుదారులు క్లాక్ టవర్ వద్దకు చేరుకున్నారు. ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మద్దతుదారులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో కానిస్టేబుల్ తలకు గాయమైంది.

Also Read.. Andhra Pradesh : పోలీస్ స్టేషన్‌లో అర్థరాత్రి కరెంట్ తీసేసి నన్ను కొట్టారు : టీడీపీ నేత పట్టాభి

నందిగామకు చెందిన హరికృష్ణారెడ్డి రాప్తాడు వచ్చి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, పరిటాల కుటుంబీకులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా, తాను క్లాక్ టవర్ వద్దకు వస్తానంటూ సవాల్ విసిరాడు. సోషల్ మీడియాలో హరికృష్ణారెడ్డి పోస్టులు టీడీపీ వర్గాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. దాంతో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అనంతపురం పట్టణంలోని క్లాక్ టవర్ వద్దకు చేరుకున్నారు. హరికృష్ణారెడ్డి కూడా క్లాక్ టవర్ వద్దకు చేరుకుని పరిటాల కుటుంబసభ్యులపై మరోసారి విమర్శలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Also Read..Bopparaju Venkateshwarlu : ఉద్యోగ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్త ఆందోళన : బొప్పరాజు వెంకటేశ్వర్లు

రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. రాళ్లదాడిలో ఓ టీడీపీ కార్యకర్తకు, పోలీస్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. టీడీపీ, వైసీపీ మధ్య రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధిపై కొంతకాలంగా సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతోంది. అనంతపురం వచ్చి మాట్లాడాలంటూ వైసీపీ మద్దతుదారుడు హరికృష్ణారెడ్డికి టీడీపీ మద్దతుదారుడు సవాల్ విసరగా, ఆ సవాల్ ను స్వీకరించిన వైసీపీ మద్దతుదారుడు అనంతపురం వచ్చాడు. తన రాకను తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. దాంతో, టీడీపీ, వైసీపీ మధ్య ఆగ్రహావేశాలు భగ్గుమన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.