CM Jagan Cabinet : వద్ధాప్య పెన్షన్‌ను రూ.2,750కి పెంచిన జగన్ ప్రభుత్వం.. గతంలో ఎంత? ఇప్పటి ప్రభుత్వం ఇచ్చేది ఎంత? వివరాలు

ఏపీలో పెన్షన్ల మొత్తాన్ని రూ.2750కి పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెరిగిన పెన్షన్లు వచ్చే జనవరి (2023)నుంచి అమలు లోకి రానున్నాయి.

CM Jagan Cabinet : వద్ధాప్య పెన్షన్‌ను రూ.2,750కి పెంచిన జగన్ ప్రభుత్వం.. గతంలో ఎంత? ఇప్పటి ప్రభుత్వం ఇచ్చేది ఎంత? వివరాలు

CM Jagan Cabinet Decided

CM Jagan Cabinet Decided : ఏపీలో పెన్షన్ల మొత్తాన్ని రూ.2750కి పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెరిగిన పెన్షన్లు వచ్చే జనవరి (2023)నుంచి అమలు లోకి రానున్నాయి. కాగా గత ప్రభుత్వం (టీడీపీ) రూ. 2,000 పెన్షన్ ఇచ్చేది. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ వృద్ధులకు ఇచ్చేపెన్షన్ పెంచుతానంటూ హామీ ఇచ్చారు. సీఎం జగన్ ప్రభుత్వం అలా ఇచ్చిన హామీని ఒకేసారి పెంచకుండా విడతల వారీగా అంటే సంవత్సరానికి రూ.250 పెంచకుంటూ వచ్చింది. అలా మూడేళ్లకు గత ప్రభుత్వం ఇచ్చే రూ.2,000కు ఏడాదికి రూ.250 పెంచుకుంటు వచ్చింది.

అలా మూడు ఏళ్లకు మొత్తంగా జగన్ ప్రభుత్వం పెంచిన మొత్తం రూ.750లు అలా తాజాగా పెంచిన పెన్షన్ మొత్తం రూ.2,750 అయ్యింది. పెన్షన్ పెంచటంలో భాగంగా సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజున రూ. 250 పెంచుతున్నట్లు ప్రకటించారు. అలా ప్రతీ ఏటా రూ.250 పెంచుతానని హామీ ఇచ్చారు. అయితే తర్వాత రెండేళ్లు పెంచలేదు. గత ఏడాది జనవరిలో పెంచారు. వచ్చే నెలలో పెంపుతో పెన్షన్ 2,750 అవుతుంది. ఆ తర్వాత 2014 జనవరికి 3000 వేలు చేస్తారు.దాంతో ఎన్నికల హామీ పూర్తి చేసినట్లు అవుతుంది. పెంచిన పెన్షన్లు 2023 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో పెన్షన్ అందుకునేవారు 62.31 లక్షల మంది ఉన్నారు.

చంద్రబాబు సీఎంగా (టీడీపీ ప్రభుత్వం) ఉన్నప్పుడు 2014-2019 ఏళ్లకు పెన్షన్ల పంపిణీకి ఖర్చు చేసింది మొత్తం రూ.27,540కోట్లు. అంటే ఏడాదికి రూ.5,508 కోట్లు పంపిణీ చేశారు. జగన్ సీఎం అయ్యాక 2019-20 పెన్షన్ల పంపిణీకి రూ.15,537 కోట్లు. 2020-21కి గానీ మొత్తం రూ.17,669 కోట్లు. అలాగే 2022-23 గాను అర్నెల్ల్లో (అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ) మొత్తం రూ.8,725.26 కోట్లు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పెన్షన్లు ఇలా ఉన్నాయి..(అక్టోబర్ నెల వరకు)
2014 (అక్టోబర్) రూ. 39 లక్షలు
2015 రూ. 40.28 లక్షలు
2016 రూ.39.17లక్షలు
2017 41.37 లక్షలు
2018లో 45.98 లక్షలు ఉండగా..

జగన్ సీఎం అయ్యాక.. పెన్షన్లు ఇలా ఉన్నాయి..
2019 (అక్టోబర్) 50.75 లక్షలు
2020 (అక్టోబర్) 50.75 లక్షలు
2021 (అక్టోబర్) 60.18 లక్షలు