AP Constable Exam Results : ఏపీ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసింది. ఫలితాలను ఏపీఎస్ఎల్ పీఆర్ బీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

AP Constable Exam Results : ఏపీ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు విడుదల

AP Constable Exam Results : ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసింది. ఫలితాలను ఏపీఎస్ఎల్ పీఆర్ బీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. 95,208 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ లో ఓఎంఆర్ ఆన్సర్ షీట్లు అందుబాటులో ఉంటాయి. ఈ నెల 13 నుంచి 20 వరకు రెండో దశ ఆన్ లైన్ అప్లికేషన్ల స్వీకరించనున్నారు.

కానిస్టేబుల్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 95,208 మంది అభ్యర్థులు ఫిజికల్ టెస్టులకు అర్హత సాధించారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 7 వరకు ఆన్ లైన్ లో ఓఎంఆర్ షీట్లు అందుబాటులో ఉంటాయని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది.
మొత్తం 6,100 పోస్టుల భర్తీ కోసం గత నెల 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు.

Police Jobs to Transgenders : ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు పోలీస్ ఉద్యోగాలు..నోటిఫికేష‌న్ జారీ చేసిన ప్రభుత్వం

రాష్ట్ర వ్యాప్తంగా 35 ప్రాంతాల్లోని 997 పరీక్షా కేంద్రాల్లో దీన్ని నిర్వహించినట్లు రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. 200 మార్కులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో ఓసీలకు 40 శాతం, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ కు 30 శాతం కటాఫ్ గా నిర్ణయించిన విషయం తెలిసిందే.