Police Jobs to Transgenders : ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు పోలీస్ ఉద్యోగాలు..నోటిఫికేష‌న్ జారీ చేసిన ప్రభుత్వం

ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు పోలీస్ ఉద్యోగాలు ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం కర్ణాటక పోలీసుల డిపార్ట్ మెంట్ నోటిఫికేష‌న్ జారీ చేసింది.

Police Jobs to Transgenders : ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు పోలీస్ ఉద్యోగాలు..నోటిఫికేష‌న్ జారీ చేసిన ప్రభుత్వం

New Project (8)

Police Jobs to Transgenders : ట్రాన్స్‌జెండ‌ర్ల‌ విషయంలో కర్ణాటక ప్రభుత్వం పెద్దమనస్సుతో గొప్ప నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు పోలీసులు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది.దీని కోసం నోటిషికేషన్ కూడా విడుదల చేసింది. ఒక్క పోలీసులు డిపార్ట్ మెంట్ లోనే కాకుండా..ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేట‌రీ కూడా ట్రాన్స్‌జెండ‌ర్ల‌ను రిక్రూట్ చేసుకోనుంది. ట్రాన్స్‌జెండ‌ర్ల‌ను భారత ప్రభుత్వం థర్డ్ జెండర్ గా గుర్తించిన విషయం తెలిసిందే. వారికి కూడా సామాన్య మనుషుల్లాగే హక్కులుంటాయని స్పష్టం చేసింది.

కానీ.. ఉద్యోగాల విష‌యంలో మాత్రం ఇప్ప‌టికే ట్రాన్స్‌జెండ‌ర్ల‌ను నియమించటానికి నోటిఫికేషన్ జారీ చేయటం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. అటువంటిది కర్ణాటక ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయటం విశేషమనే చెప్పాలి. సాధారణంగా ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు ఇవ్వటానికి ఏ కంపెనీలు ఆసక్తిచూపించవు. ఇక ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో వాళ్ల‌కు అవ‌కాశాలు పెద్దగా లేవనే చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో కర్ణాటక ప్రభుత్వం ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు శుభవార్త చెప్పింది. ట్రాన్స్‌జెండ‌ర్ల‌ను పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి తీసుకునేందుకు రిక్రూట్‌మెంట్‌ను ప్ర‌క‌టించింది. స్పెష‌ల్ రిజ‌ర్వ్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్స్‌, సీన్ ఆఫ్ క్రైమ్ ఆఫీస‌ర్ల రిక్రూట్‌మెంట్‌లో ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు కూడా డిపార్ట్‌మెంట్ అవ‌కాశం క‌ల్పించింది.

Read more : woman constable gender change : మహిళా కానిస్టేబుల్ లింగ మార్పిడికి హోంశాఖ అనుమతి..సర్జరీ తరువాత ఉద్యోగం చేయొచ్చు..

ఈ వినూత్న నిర్ణయంపై అడిష‌న‌ల్ డీజీపీ మాట్లాడుతు..పోలీసు శాఖలో ప్రకటించిన 70 పోస్టుల‌లో 5 పోస్టులు కేవ‌లం ట్రాన్స్‌జెండ‌ర్ల కోస‌మే రిజ‌ర్వ్ చేశామని తెలిపారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేయాల‌న్న ఆశ‌యం ఉన్న ట్రాన్స్‌జెండ‌ర్లు.. ఆన్‌లైన్ ప‌ద్ధ‌తి ద్వారా డిసెంబ‌ర్ 12 నుంచి జ‌న‌వ‌రి 18 వ‌ర‌కు అప్ల‌యి చేసుకోవ‌చ్చని వెల్లడించారు.కర్ణాటక ప్రభుత్వం ట్రాన్స్‌జెండ‌ర్లకు పోలీసు శాఖ‌లోనే కాకుండా..ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేట‌రీ కూడా ట్రాన్స్‌జెండ‌ర్ల‌ను రిక్రూట్ చేసుకోవటానికి ఇటీవల ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది కూడా. ఈ నోటిఫికేష‌న్ ప్ర‌కారం.. ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు మూడు పోస్టుల్ని కేటాయించింది. 206 సీన్ ఆఫ్ క్రైమ్ ఆఫీస‌ర్ల కోసం నియామాక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఉద్యోగం కోసం జ‌న‌వ‌రి 15 వ‌ర‌కు అప్ల‌యి చేసుకోవ‌చ్చుని వెల్లడించింది.

క‌ర్ణాట‌క సివిల్ స‌ర్వీసెస్‌(జ‌న‌ర‌ల్ రిక్రూట్‌మెంట్‌) రూల్స్ 1977 ప్ర‌కారం ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో ఒక శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ రూల్ ప్ర‌కార‌మే ఇప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల‌కు ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తున్నామ‌ని అడిష‌న‌ల్ డీజీపీ వెల్డించారు. వాళ్ల కోసం రిజ‌ర్వ్‌లో కేటాయించిన ఐదు పోస్టుల‌లో నాలుగు పోస్టులు క‌ర్ణాట‌క స్టేట్ రిజ‌ర్వ్ పోలీస్‌లో స్పెష‌ల్ రిజ‌ర్వ్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ల కోసం..ఐదవది ఇండియా రిజ‌ర్వ్ బెటాలియ‌న్‌లో స్పెష‌ల్ రిజ‌ర్వ్ పోస్ట్ కోసం నియామాక‌లు చేప‌ట్ట‌నున్నారు.

Read more : లింగ మార్పిడి చేయించుకుని యువతిని పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్