Minister Adimulapu Suresh : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్‍కు తృటిలో తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‍కు(Minister Adimulapu Suresh) తృటిలో ప్రమాదం తప్పింది. సురేశ్ పారా గ్లైడింగ్ చేస్తుండగా టేకాఫ్ సమయంలో ఇంజిన్ పక్కకు ఒరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మంత్రిని రక్షించారు.

Minister Adimulapu Suresh : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్‍కు తృటిలో తప్పిన ప్రమాదం

Adimulapu Suresh

Minister Adimulapu Suresh : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‍కు(Minister Adimulapu Suresh) తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్నంలో(Visakhapatnam) మంత్రి ఆదిమూలపు సురేశ్ పారా గ్లైడింగ్ కు(Para Gliding)ప్రయత్నం చేశారు. ప్రతికూల వాతావరణంతో పారా గ్లైడింగ్ కుదుపులకు లోనైంది. మంత్రుల సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మంత్రిని రక్షించారు. ఈ పరిణామంతో మంత్రి ఆదిమూలపు సురేశ్ ను ఒక్కసారిగా ఆందోలనకు గురయ్యారు.

విశాఖపట్నంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం విశాఖ ఆర్కే బీచ్ లో(Visakha RK Beach) సురేశ్ పారా గ్లైడింగ్ చేస్తుండగా టేకాఫ్ సమయంలో ఇంజిన్ పక్కకు ఒరిగింది. అయితే మంత్రి వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో మంత్రి సురేశ్ తోపాటు అక్కడే ఉన్న ఇతర మంత్రులు, అధికారులు షాక్ అయ్యారు.

Amma Vodi Scheme : జగనన్న అమ్మఒడి పథకంపై ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు : మంత్రి ఆదిమూలపు క్లారిటీ

జీ-20 సదస్సులో(G-20 Summit) భాగంగా విశాఖపట్నంలో మారథాన్ సాహస క్రీడలు(Marathon Adventure Sports) నిర్వహిస్తున్నారు. మారధాన్ ను మంత్రులు ఆదిమూలపు సురేశ్, విడుదల రజనీ, గుడివాడ అమర్నాథ్ క్రీడలను ప్రారంభించారు. అనంతరం నిర్వాహకుల ఆహ్వానం మేరకు మంత్రి ఆదిమూలపు సురేశ్ పారా గ్లైడింగ్ కు సిద్ధమయ్యారు.

ఈ కార్యక్రమాన్ని మంత్రి విడుదల రజనీ జెండా ఊపి ప్రారంభించారు. అయితే గాలి దిశ సహకరించకపోవడంతో సురేశ్ పయనిస్తున్న పారా గ్లైడర్ కుదుపులకు లోనైంది. పోలీసులు అప్రమత్తమై మంత్రి రక్షిచండంతో ఎలాంటి అపాయం జరుగలేదు. మంత్రి సురేశ్ సుక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు.