Mekathoti Sucharita : రాజీనామా చేయలేదు.. కృతజ్ఞతా లేఖను రాజీనామాగా ప్రచారం చేశారు: మాజీ హోంమంత్రి సుచరిత

నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు.. కృతజ్ఞతా లేఖను రాజీనామాగా ప్రచారం చేశారు అంటూ చెప్పుకొచ్చి ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత.

Mekathoti Sucharita : రాజీనామా చేయలేదు.. కృతజ్ఞతా లేఖను రాజీనామాగా ప్రచారం చేశారు: మాజీ హోంమంత్రి సుచరిత

Meakthoti Sucharitha Comments On Her Mla Post Resignation

mekathoti sucharitha : ఏపీ మంత్రివ‌ర్గ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ జరిగిన క్రమంలో తనకు మరోసారి మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో అల‌క‌బూనిన మాజీ హోం శాఖామంత్రి మేక‌తోటి సుచ‌రిత ఎట్టకేలకు అల‌క వీడారు. ‘నేను సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతు లేఖ రాశానని..దాన్ని రాజీనామాగా ప్రచారం చేశారని..నా థ్యాంక్స్ గివింగ్ లెట‌ర్‌ను నా కుమార్తె త‌ప్పుగా అర్థం చేసుకుంద‌ని..దాన్నే రాజీనామా లేఖ అని వెల్లడించింది అంటూ చెప్పుకొచ్చారు. సుచరితతో మాట్లాడటానికి సీఎం జగన్ స్వయంగా కబురు పంపించినా ఆమె తీరు మారని సుచరిత పలుమార్లు ప్రముఖ నేతలతో సంప్రదింపులు జరిపినా పట్టువీడని సుచరిత సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేయటంతో దిగివచ్చారు. ఈరోజు (ఏప్రిల్ 13,2022)తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యానికి వ‌చ్చిన ఆమె సీఎం జ‌గ‌న్‌తో గంట‌న్న‌ర‌కు పైగా భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత ఆమె అక్క‌డే మీడియాతో మాట్లాడారు. త‌న అల‌క‌, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా అంటూ జ‌రిగిన ప్ర‌చారంపై ఆమె స్పందిస్తు పలు విషయాలు చెప్పుకొచ్చారు. ఇదంతా సమర్థించుకోవటానికేనని తెలుస్తున్నా..ఆమె పలు విషయాలు చెప్పుకొచ్చారు.

సీఎం జగన్ తో భేటీ తరువాత మీడియాతో సుచరిత మాట్లాడుతూ..ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంత్రివర్గ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ‌లో ప‌ద‌విని ఆశించానని.. ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో కొంచెం ఎమోష‌న్‌కు గురైన మాట వాస్త‌వ‌మేన‌ని ఆమె చెప్పారు. మంత్రివ‌ర్గ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ సంద‌ర్భంగా థ్యాంక్స్ గివింగ్ లెట‌ర్ రాశాన‌ని, దానినే నా కుమార్తె త‌ప్పుగా అర్థం చేసుకుని ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్టుగా చెప్పింద‌ని చెప్పుకొచ్చారు. రాజీనామా అన్న ప్ర‌శ్నే లేదంటూ చెప్పుకొచ్చారు.

రాజ‌కీయాల నుంచి నుంచి త‌ప్పుకోవాల్సి వ‌స్తే.. వైసీపీ కార్య‌క‌ర్త‌గానే కొన‌సాగుతాన‌ని మేక‌తోటి చెప్పుకొచ్చారు. వైసీపీ ఓటరుగానే ఉంటానని తెలిపారు.త‌న‌ను సీఎం జ‌గ‌న్ త‌న కుటుంబంలోని వ్య‌క్తిగా ప‌రిగ‌ణిస్తార‌ని ఆమె చెప్పారు. జ‌గ‌న్ నిర్ణ‌యానికి తాను క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని కూడా సుచ‌రిత చెప్పారు. కొంత‌కాలంగా అనారోగ్యం నేప‌థ్యంలో బ‌య‌ట‌కు రాలేక‌పోయాన‌ని కూడా ఆమె చెప్పారు. సీఎం జగన్ ను తాను కలవటానికి ఇష్టపడలేదని కొంతమంది..కలవటానికి యత్నించినా జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని మరికొంతమంది ప్రచారం చేశారని కానీ ఇవన్నీ అవాస్తవాలేనని..జగన్ ను తాను ఎప్పుడు కలసి మాట్లాడాల్లా తనకు స్వేచ్చ ఉందని అన్నారు.

జగన్ కు తాను అంటే ఎంతో అభిమానం ఉందని 2009లో నేను ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచాను. జెడ్పీటీసీ స్థాయి నుంచి హోంమంత్రి స్థాయివరకు ఎదిగాను అంటే అది జగన్ గారు నామీద చూపించిన అభిమానం.. నమ్మకమేనని అది ఆయన ఇచ్చిన అవకాశమేనని సుచరిత చెప్పుకొచ్చారు. మంత్రుల మార్పు ఉంటుందని జగన్ ముందే చెప్పారని కానీ మంత్రి పదవి మరోసారి వస్తుందని ఆశపడ్డానని రాకపోవటంతో కొంచెం బాధపడినమాట నిజమేనని తెలిపారు. పదవులు ఈరోజు ఉంటాయి తరువాత పోతాయి. కానీ జగన్ పై నాకున్న అభిమానం ఎప్పటికి ఉంటుందని మేకతోటి సుచరిత చెప్పుకొచ్చారు.