AP Assembly : మే 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

కరోనాతో నెలకొన్న కఠిన పరిస్థితుల మధ్య బడ్జెట్ సమావేశాలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది.

AP Assembly : మే 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Ap Assembly Meetings From May 20

AP Assembly meetings : కరోనాతో నెలకొన్న కఠిన పరిస్థితుల మధ్య బడ్జెట్ సమావేశాలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. మే 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.  బడ్జెట్, కోవిడ్ అంశాలపై చర్చించనున్నారు.

కోవిడ్ సంక్షోభం నెలకొని ఉండటంతో సమావేశాలను మూడు రోజుల్లోపే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శాసన సభ్యులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. నెగెటివ్ వచ్చిన వారికే సభకు అనుమతి ఇవ్వనున్నారు.

నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి బడ్జెట్ సమావేశం కావాల్సివుంటుంది. శీతాకాల సమావేశాల తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశం కాలేదు. దీంతో జూన్ లో కచ్చితంగా అసెంబ్లీ సమావేశం కావాల్సివుంది. దీనికి తోడు మే 24న శాసన మండలి చైర్మన్ రిటైర్ కానున్నారు. మే 24కు ముందే బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

ఏపీ అసెంబ్లీలో 60 ఏళ్లు పైబడిన శాసన సభ్యులు ఎక్కువగా ఉన్నారు. దీంతో వర్చువల్ పద్ధతిలో శాసన సభ నిర్వహించాలని తొలుత భావించినా చివరకు వెనక్కు తగ్గారు. శాసన సభ్యులందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించి…నెగెటిట్ రిపోర్టు వచ్చిన వారినే శాసన సభకు అనుమతించాలని నిర్ణయించారు.

ఈ సారి సమావేశాల్లో జీరో, క్వశ్చన్ అవర్ లను మినహాయించనున్నారు. ఇక బడ్జెట్ తోపాటు కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది.