Perni Nani : ఏపీ సినిమా ధియేటర్లలో రోజుకు 4 ఆటలే

ఏపి సినిమా రెగ్యులేషన్ అండ్ అమెండ్‌మెంట్ యాక్ట్ ను సినిమాటోగ్రఫీ, సమాచార శాఖమంత్రి మంత్రి పేర్ని నాని ఈ రోజు శాసనసభలో ప్రవేశ పెట్టారు.

Perni Nani :  ఏపీ సినిమా ధియేటర్లలో రోజుకు 4 ఆటలే

Perni Nani

Perni Nani :  ఏపి సినిమా రెగ్యులేషన్ అండ్ అమెండ్‌మెంట్ యాక్ట్ ను సినిమాటోగ్రఫీ, సమాచార శాఖమంత్రి మంత్రి పేర్ని నాని ఈ రోజు శాసనసభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ …. సినిమా ధియేటర్లలో రోజుకు నాలుగు ఆటలు ప్రదర్శించాల్సిన సినిమాను, ఆరు నుంచి ఎనిమిది షోలు వేస్తున్నారని అన్నారు. సినీ పరిశ్రమలో ఏమి చేసినా ఎవ్వరు ఏమి అనరు, మనకి ఎదురు లేదు…చట్టాలు మమ్మల్ని ఆపజాలవు అన్న పోకడలు చూస్తున్నామని అన్నారు.

పేద మధ్యతరగతి వారికి సినిమా వినోదం. ప్రజల బలహీనతలు సినిమా నిర్మాతలు సొమ్ము చేసుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టే ఆన్లైన్ టికెట్ విధానం వల్ల మాత్రమే ఇది సాధ్యం అవుతుందని ఆయన వివరించారు. థియేటర్‌‌లో కూడా గంట ముందు ఆన్లైన్ లోనే టికెట్లు ఇస్తారని ఆయన తెలిపారు.

సినిమా ప్రదర్శన కూడా ప్రభుత్వం నిర్ధారించిన సమయంలోనే ప్రదర్శించాలని మంత్రి అన్నారు. కేవలం రోజుకి 4షోలు మాత్రమే వేయాలనేది ప్రభుత్వం ఉద్దేశం అని… ఇంటి దగ్గర్నుంచి కదలకుండా ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు సినిమా చూసేలా మధ్యతరగతి వారి కోసం సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు  చేస్తున్నాం అని మంత్రి పేర్ని చెప్పారు.

సినిమాలకు వస్తున్న కలెక్షన్‌లను, జిఎస్టీని పోల్చి చూస్తే ఎక్కడా పొంతన కుదరడం లేదని మంత్రి వివరించారు. ప్రభుత్వానికి రావాల్సిన టాక్స్‌లు నిర్మాతలు ఎగ్గోట్టే  పరిస్థితి రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని అన్నారు. సినిమా రంగానికి సంబందించిన వారు ఎవ్వరూ ఈ విధానాన్ని వ్యతిరేకించడం లేదని…కొన్ని రాజకీయ పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయని ఆయన చెప్పారు.
Also Read : Telangana : కిడ్నీ రోగుల‌కు ఉచితంగా డ‌యాల‌సిస్‌..ప్ర‌త్యేక కేంద్రాల ఏర్పాటుకు మంత్రి ఆదేశం
ఆన్ లైన్ టికెటింగ్ ద్వారా ప్రభుత్వం అప్పులు తెస్తుందని కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మంత్రి ఖండించారు.సినిమా డిస్ట్రిబ్యూటర్ ప్రభుత్వంపై నిందలు వేస్తే అర్థం ఉంటుంది…కానీ ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం పై బురద వేయడం దురదృష్టంఅని ఆయన అన్నారు. .బస్సు,రైలు టిక్కెట్లు ఆన్ లైన్ తీసుకోవడానికి లేని అభ్యంతరం సినిమా టిక్కెట్లపై ఎందుకు అని ఆయన పశ్నించారు. ఆన్ లైన్ టికెట్ విధానాన్ని ఎఫ్‌డిసి నిర్వహిస్తుందని పేర్ని నాని తెలిపారు.