AP Cabinet : మంత్రివర్గం ఎలా ఉంటుందో చెప్పిన సజ్జల.. కేబినెట్‌‌లో సమూల మార్పులు

మంత్రివర్గ విస్తరణ మొత్తాన్ని సీఎం జగన్ చూస్తున్నట్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేలా కేబినెట్ ఉంటుందన్నారు. కేబినెట్ లో మెజార్టీ మార్పులుంటాయని చెప్పారు...

AP Cabinet : మంత్రివర్గం ఎలా ఉంటుందో చెప్పిన సజ్జల.. కేబినెట్‌‌లో సమూల మార్పులు

Sajjala

AP Cabinet Reshuffle : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అందరి చూపు మంత్రివర్గ విస్తరణపై నెలకొంది. ఎవరు కొత్త వారు వస్తారు.. ఎవరు మంత్రి పదవులు కోల్పోతారనే ఉత్కంఠ నెలకొంది. తమకు మంత్రి పదవులు వస్తుందని ఆశావాహులు భావిస్తున్నారు. అయితే.. మంత్రివర్గ విస్తరణపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2022, ఏప్రిల్ 02వ తేదీ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ మొత్తాన్ని సీఎం జగన్ చూస్తున్నట్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేలా కేబినెట్ ఉంటుందన్నారు. కేబినెట్ లో మెజార్టీ మార్పులుంటాయని చెప్పారు. సీఎం జగన్ సోషల్ జస్టిస్ కు అనుగుణంగా మంత్రివర్గం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు సజ్జల చేసిన కామెంట్స్ చర్చనీయాంశమవుతున్నాయి.

Read More : AP Government : రాజధాని పట్ల హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు

ఏప్రిల్ 11న కేబినెట్ ను ముఖ్యమంత్రి జగన్ విస్తరించనున్నారు. ఇందుకు సంబంధించి.. ఏప్రిల్ 8న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశమై.. పూర్తి సమాచారాన్ని అందించనున్నారు. మంత్రి పదవిని కొత్తగా అవకాశం అందుకోనున్నవారికి.. ఒక రోజు ముందుగా.. అంటే ఏప్రిల్ 10న సమాచారం అందనున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ ను విస్తరించిన తర్వాత.. పాత, కొత్త మంత్రులందరికీ.. ముఖ్యమంత్రి జగన్ విందు ఇవ్వనున్నారు. ఇప్పటికే.. ఏపీ మంత్రి వర్గ విస్తరణపై రకరకాల వార్తలు.. రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొట్టాయి. ఓ దశలో.. ముఖ్యమంత్రి జగన్.. స్వయంగా ఈ విషయంపై తన సహచరులకు దిశానిర్దేశం చేశారు. కేబినెట్ విస్తరణ అన్నది.. ప్రభుత్వం ఏర్పాటైనప్పుడే తీసుకున్న నిర్ణయమని గుర్తు చేశారు. పదవులు పోయిన వారికి పార్టీ జిల్లా బాధ్యతలు అందుతాయని తెలిపారు.

Read More : TDP Fight : ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపుపై టీడీపీ పోరు.. ఇంటింటికీ కొవ్వొత్తులు, అగ్గిపెట్టెల పంపిణీ

పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాలని జగన్.. క్లియర్ కట్ గా ఎప్పుడో చెప్పేశారు. అప్పటి నుంచి.. కేబినెట్ లో ఉండేదెవరు.. ఊడేదెవరు.. అన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగానే నడిచింది. 95 శాతం మంది మంత్రులను తప్పించి.. తన టీమ్ ను కొత్తగా జగన్ రూపొందించనున్నారన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. మరోవైపు.. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కొందరు.. తమకు పదవి పోయినా ఇబ్బంది లేదని.. జగన్ ఎలా చెబితే అలా పని చేస్తామని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో.. కేబినెట్ విస్తరణపై ఇప్పుడు స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. 11నే విస్తరణ ఉంటుందని తెలుస్తుండడంతో.. మంత్రివర్గంలో ఉండేదెవరో.. ఊడేదెవరో అన్న చర్చ జోరందుకునే అవకాశం ఉంది. మరోవైపు.. అన్ని జిల్లాల నుంచి ఆశావహులు భారీగానే కేబినెట్‌లో స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. తమ సీనియారిటీ, కులాల ప్రాతిపదికన.. ఈ సారైనా తమకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక కొందరేమో.. తమకు కేబినెట్‌లో బెర్త్‌ కన్ఫామ్ అంటూ దీమాగా ఉన్నాయి. అయితే.. వీటన్నింటికీ ఏప్రిల్‌ 7న ఎండ్‌కార్డ్‌ పడుతుందని.. అదే రోజు కొత్త మంత్రివర్గంలో ఎవరు ఇన్‌.. ఎవరు ఔట్ అనేది తేలిపోతుందని తెలుస్తోంది.