Nara Lokesh : టీడీపీ నేత నారా లోకేష్ కు ఏపీ సీఐడీ నోటీసులు

అక్టోబర్ 4వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో ఏ1గా నారా లోకేష్ ఉన్నారు.

Nara Lokesh : టీడీపీ నేత నారా లోకేష్ కు ఏపీ సీఐడీ నోటీసులు

CID notices Nara Lokesh

Updated On : September 30, 2023 / 6:24 PM IST

Nara Lokesh – CID Notice :  టీడీపీ నేత నారా లోకేష్ కు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ కు సీఐడీ అధికారులు అందజేశారు. శనివారం ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసంలో నారా లోకేష్ ను సీఐడీ అధికారులు కలిసి నోటీసులు అందించారు. 41 ఏ కింద లోకేష్ కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10గంటలకు సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని సీఐడీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. నోటీసుల్లో ఉన్న అన్ని అంశాలను చదివాక లోకేష్ సంతకం పెట్టారు. విచారణకు వస్తానని లోకేష్ చెప్పినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో ఏ1గా నారా లోకేష్ ఉన్నారు.

Also Read: ఏపీలో రాజకీయ కురుక్షేత్రం.. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలే నెక్ట్స్‌ టార్గెట్?

ఈ మేరకు ఏపీ సీఐడీ అధికారులతో నారా లోకేష్ మాట్లాడారు. ఏ కేసులో నోటీసులు ఇస్తున్నారని సీఐడీ అధికారులను లోకేష్ అడిగారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వాట్సాప్ లోనూ నోటీసులు ఇచ్చారని.. రిప్లై కూడా ఇచ్చాను కదా అని లోకేష్ తెలిపారు. నేరుగా నోటీసులు ఇవ్వాలని వచ్చామని సీఐడీ అధికారులు వివరించారు.

Also Read : కాంగ్రెస్ ను అడ్డుకోవడం నీ వల్ల కాదు.. నీ అయ్య వల్ల కూడా కాదు : రేవంత్ రెడ్డి