KCR JAGAN : ఒకే వేదికపై కేసీఆర్, జగన్

చాలారోజుల తర్వాత తెలుగురాష్ట్రాల సీఎంలు ఒకే వేదికపై కనిపించారు. ఆదివారం పోచారం శ్రీనివాస్ రెడ్డి మనుమరాలి వివాహానికి ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.

KCR JAGAN : ఒకే వేదికపై కేసీఆర్, జగన్

Kcr Jagan

Updated On : November 21, 2021 / 2:08 PM IST

KCR JAGAN : తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్.. ఒకే వేదికను పంచుకున్నారు. ఆదివారం తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనుమరాలి వివాహం, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కుమారుడితో శంషాబాద్‌లోని వీఎంఆర్ గార్డెన్‌లో జరిగింది. ఈ వివాహానికి ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.

చదవండి : CM Jagan : కుటుంబానికి రూ.5లక్షలు, వరద పరిహారం ప్రకటించిన సీఎం జగన్

వివాహ వేదికకు ఇద్దరు సీఎంలు ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకున్నారు. వధూవరులను ఆశీర్వదించిన సీఎంలు అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకోవడం ఇదే తొలిసారి. ఇక వీరివురు వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నట్లుగా సమాచారం.

చదవండి : MLA Raja singh-CM KCR : సీఎం కేసీఆర్ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది : ఎమ్మెల్యే రాజాసింగ్

ఇక ఇదిలా ఉంటే ఈ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ తన బృందంతో ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రులతో కేసీఆర్ భేటీ కానున్నారు. వరి కొనుగోళ్లు, ఢిల్లీ రైతు ఉద్యమంలో పాల్గొన్నవారికి నష్టపరిహారం అందించడం.. వంటి అంశాలపై కేంద్రపెద్దలతో మాట్లాడే అవకాశం ఉంది. ఇక జగన్ రాష్ట్రంలో వరదల తీవ్రత, పంట నష్టంపై అధికారులతో వర్చువల్‌గా భేటీ అయ్యే అవకాశం ఉంది.