CM KCR Demands : సహనాన్ని పరీక్షించొద్దు..నీటి వాటాలు తేల్చేయాలి, లేకపోతే ఇక పోరాటాలే

నీటి వాటాలు వెంటనే తేల్చేయండి..ఎన్ని రోజులు తీసుకుంటారు..ఇప్పటికే ఏడేండ్లు అయిపోయింది..ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి..

CM KCR Demands : సహనాన్ని పరీక్షించొద్దు..నీటి వాటాలు తేల్చేయాలి, లేకపోతే ఇక పోరాటాలే

Kcr Water Dispute

Telugu State Water Disputes : నీటి వాటాలు వెంటనే తేల్చేయండి..ఎన్ని రోజులు తీసుకుంటారు..ఇప్పటికే ఏడేండ్లు అయిపోయింది..ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి..లేకపోతే..ఉద్యమాలు..పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆయన ఎండగట్టారు. రాష్ట్ర విభజన జరిగి ఎన్ని ఏండ్లు అయ్యింది ? కేంద్రం ఇంకా నీటి వాటాలు తేల్చలేదన్నారు. కేంద్రం చేస్తున్న ఆలస్యం వల్ల…ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయని..ఫలితంగా అభివృద్ధికి ఆటంకం కలుగుతోందన్నారు. 2021, నవంబర్ 20వ తేదీ శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి పలు అంశాలపై మాట్లాడారు. అందులో నీటివాటాల విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

Read More : Theaters Parking Fee : సింగిల్ థియేటర్లలో పార్కింగ్ ఫీజులపై కొత్త జీవో

తాను, మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులతో ఆదివారం ఢిల్లీకి వెళ్లడం జరుగుతోందని కేంద్ర జలశక్తి మంత్రి, ఇతర ఉన్నతాధికారులను కలిసి నీటి వాటాల విషయాన్ని ప్రస్తావిస్తామన్నారు. అవసరమైతే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసి వెంటనే తేల్చేయాలని కోరుతామన్నారు. ఇప్పటికీ ఏడు సంవత్సరాలు పూర్తయిందని..ఈ కాలంలో ప్రాజెక్టులు కట్టడం..ఇతరత్రా ప్లాన్స్ ఉంటాయని..కానీ..కేంద్రం తేల్చలేకపోవడం వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయన్నారు. గోదావరి, కృష్ణా పంపకాల విషయంలో ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలన్నారు.

Read More : Paddy Issue : రేపే ఢిల్లీకి..ధాన్యం కొనుగోళ్ల విషయంలో తేల్చుకుంటాం

ఏపీ, తెలంగాణ మధ్యనున్న వాటాలు తేల్చేందుకు ఒక టైం బాండ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మరింత కాలయాపన చేస్తే..మాత్రం పెద్ద ఎత్తున పోరాటాలకు, ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. తాము కోర్టులో కూడా కేసును ఉపసంహరించుకోవడం జరిగిందనే విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమాల గడ్డ అని, నీటి వాటా తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. ఆ భాధ్యతను కేంద్రం విస్మరించిందని సీఎం కేసీఆర్ విమర్శించారు.