Paddy Issue : రేపే ఢిల్లీకి..ధాన్యం కొనుగోళ్ల విషయంలో తేల్చుకుంటాం

త్వరలోనే తాను..ఇతర మంత్రులు, అధికారులతో త్వరలోనే ఢిల్లీకి వెళుతున్నట్లు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో అక్కడే తేల్చుకుంటామన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.

Paddy Issue : రేపే ఢిల్లీకి..ధాన్యం కొనుగోళ్ల విషయంలో తేల్చుకుంటాం

Cm Kcr

CM KCR : త్వరలోనే తాను..ఇతర మంత్రులు, అధికారులతో 2021, నవంబర్ 21వ తేదీ ఆదివారం ఢిల్లీకి వెళుతున్నట్లు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో అక్కడే తేల్చుకుంటామన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. గత కొన్ని రోజులుగా వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు డిమాండ్స్ చేస్తోంది. కానీ..కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల..సీరియస్ గా పరిగణిస్తోంది. టీఆర్ఎస్ మహాధర్నా అనంతరం కేంద్రం, ఎఫ్ సీఐ స్పందనపై ఆయన రియాక్ట్ అయ్యారు. 2021, నవంబర్ 20వ తేదీ శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Read More : Live : సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్.. రేపు ఢిల్లీకి వెళ్తున్నా..

వరి ధాన్యం కొనుగోళ్ల మీదు జరుగుతున్న వ్యవహారంలో…ఎన్నిమార్లు డిమాండ్ చేసినా కేంద్రం నుంచి ఉలుకు..పలుకు లేదని విమర్శించారు. అన్ని రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసినట్లే..తమ రాష్ట్రం నుంచి కొనుగోలు చేయడం లేదని.. ఈ విషయంలో తాము మహాధర్నా చేయడం జరిగిందని వెల్లడించారు. త్వరలో తాము ఢిల్లీకి వెళ్లడం జరుగుతుందని, అక్కడ మంత్రి, ఇతర ఉన్నతాధికారులను కలవడం జరుగుతుందని, అవసరమయితే…ప్రధాన మంత్రిని కూడా కలిసి..ఈ విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుందన్నారు.

Read More : Maulana Syed Madani : సీఏఏని కూడా రద్దు చేయాల్సిందే

తమకు న్యాయం చేయాలని కోరడం జరుగుతుందన్నారు. ముందుగానే చెబితే…వేరే పంట వేసుకొనే వారమని..అలాకాక..వరి పంట వేసి కష్టాలు, సమస్యలు ఎదుర్కొంటున్నామని రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారన్నారు. ధాన్యం కొనుగోలు విషయం, బాయిల్డ్ రైస్ కొనమని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఈ విషయంలో ఢిల్లీలో తేల్చుకుంటామన్నారు సీఎం కేసీఆర్.