AP Coal shortage : బొగ్గు కొరత తీవ్రంగా ఉంది – బాలినేని

దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత వేధిస్తోందని, ఈ సమస్య రాష్ట్రంపై ప్రభావం చూపిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ వెల్లడించారు.

AP Coal shortage : బొగ్గు కొరత తీవ్రంగా ఉంది – బాలినేని

Ap Current cut

AP Coal Crisis : దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత వేధిస్తోందని, ఈ సమస్య రాష్ట్రంపై ప్రభావం చూపిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ వెల్లడించారు. బొగ్గు కొరత వల్ల విద్యుత్ సరఫరాలో సమస్య వచ్చిందని, ఏపీ జెన్ కో కేంద్రాల్లొ బొగ్గు సరఫరా తగినంత లేదన్నారు. రోజుకు 3 వేల 700 మెగావాట్ల ఉత్పత్తి చేయాల్సి ఉంటే…ఇప్పుడు 2000 వేల నుంచి 2 వేల 200 మెగావాట్ల ఉత్పత్తి చేస్తున్నామన్నారు. బొగ్గు సరఫరా మెరుగుపడటానికి సుమారు మూడు నెలల సమయం పడుతుందని వెల్లడించారు మంత్రి బాలినేని శ్రీనివాస్.

Read More : Coal Crisis AP : ఏపీలో కరెంటు కోతలు..టైమింగ్స్ ఇవే

భారతదేశంలో బొగ్గు కొరత తీవ్రంగా వేధిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడబోతోందని, ఫలితంగా అంధకారం నెలకొంటుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో కరెంటు కోతలకు సిద్ధమైంది అక్కడి ప్రభుత్వం. ముందుగా గృహ వినియోగదారులపై ప్రభావం పడనుంది. సాయంత్రం 06 గంటల నుంచి రాత్రి 10.30 గంటల మధ్యలో విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే అనధికారికంగా కరెంటు సరఫరా ఉండడం లేదు.

Read More : Andhra Pradesh : విద్యుత్ సంక్షోభం దిశగా ఆంధ్రప్రదేశ్..కరెంట్‌ కోతలు తప్పవా?

తాజాగా..కరెంటు కోతలు ఉంటాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. APCPDCL, EPDCL పరిధిలో 300 మెగావాట్ల కోత ఉందని అంచనా. SPDCL పరిధిలో 100 మెగావాట్లు కోత ఉంది. రాష్ట్రంలో 190 మిలియన్ యూనిట్ల కొరత ఉంది. యూనిట్ కు రూ. 15లతో కరెంటు కొనుగోలు చేస్తున్నారు. ధర మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అధిక ధరలకు కొందామని అనుకున్నా…విద్యుత్ దొరకడం లేదు. బొగ్గు కొరతతో ఇప్పటికే పలు సంస్థలు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశాయి.