Pawan Kalyan : గౌతమ్ సవాంగ్‌ని ఎందుకు తప్పించారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్

అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావచ్చు... కానీ డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏం వచ్చింది? ఇందుకు గల కారణాలను..

Pawan Kalyan : గౌతమ్ సవాంగ్‌ని ఎందుకు తప్పించారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan

Pawan Kalyan : ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జీఏడీలో రిపోర్ట్ చేయాలని సవాంగ్ ను ప్రభుత్వం ఆదేశించింది. కాగా, గౌతం సవాంగ్ బదిలీ అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సడెన్ గా ఆయనను తప్పించడం చర్చకు దారితీసింది. గౌతమ్ సవాంగ్ బదిలీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఈ రోజు మధ్యాహ్నం వరకూ విధుల్లో ఉన్న గౌతమ్ సవాంగ్ ని ఆకస్మికంగా ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించడం తనకు విస్మయం కలిగించిందని పవన్ అన్నారు. అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావచ్చు… కానీ వైసీపీ ప్రభుత్వానికి.. డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏం వచ్చింది? ఇందుకు గల కారణాలను ప్రజలకు తెలియచెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్.

Chandrababu : వైసీపీ అధికారంలోకి వస్తే చీకటి రాజ్యం వస్తుందని ఆనాడే చెప్పా-చంద్రబాబు

లేని పక్షంలో విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే సవాంగ్ పై బదిలీ వేటు వేశారని భావించాల్సి వస్తుందని అన్నారు. ఉన్నతాధికారుల నుంచి చిన్నపాటి ఉద్యోగి వరకూ అందరినీ హెచ్చరించి.. భయపెట్టి.. అదుపు చేసేందుకు సవాంగ్ గారి బదిలీని ఉదాహరణగా చూపించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందని పవన్ అన్నారు. ఈ బదిలీ తీరు చూస్తే వైసీపీ ప్రభుత్వం చీఫ్ సెక్రెటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంని ఆకస్మికంగా పక్కకు తప్పించడమే గుర్తుకు వస్తుందన్నారు.

Varuna Reddy: కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ వరుణారెడ్డి బదిలీ

జగన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డిని నూతన డీజీపీగా నియమించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ జీఏడీలో రిపోర్టు చేయాలని సవాంగ్‌ను ఆదేశించింది ప్రభుత్వం.

పీఆర్సీ పై ఆందోళన చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఫిబ్రవరి 3న ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించిన తర్వాత పరిణామాలు మారాయి. ఈ నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని చెప్పినప్పటికీ భారీ సంఖ్యలో ఉద్యోగులు విజయవాడ వచ్చారు. ఉద్యోగులు భారీగా తరలిరావడంతో ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిగా ఉంది. దీనిపై డీజీపీ సవాంగ్.. సీఎం జగన్‌ను కలిసి వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఉన్నట్టుండి డీజీపీని బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. అంతేకాదు రెండు రోజుల క్రితం ఏపీ సీఎంవోలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పుడు డీజీపీని ట్రాన్స్‌ఫర్ చేయడం చర్చనీయాంశమైంది. అధికారులను బదిలీ చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న అనూహ్య నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారాయి.