Chandrababu : వైసీపీ అధికారంలోకి వస్తే చీకటి రాజ్యం వస్తుందని ఆనాడే చెప్పా-చంద్రబాబు

వైసీపీ అధికారంలోకి వస్తే చీకటి రాజ్యం వస్తుందని తాను ఆనాడే చెప్పానని చంద్రబాబు అన్నారు. ఒక్క అవకాశం అంటూ ఓటు వేస్తే.. విద్యుత్ తీగలని పట్టుకోవటమే అని ఆనాడే హెచ్చరించాను అన్నారు.

Chandrababu : వైసీపీ అధికారంలోకి వస్తే చీకటి రాజ్యం వస్తుందని ఆనాడే చెప్పా-చంద్రబాబు

Chandrababu

Updated On : February 15, 2022 / 7:16 PM IST

Chandrababu : ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వస్తే చీకటి రాజ్యం వస్తుందని తాను ఆనాడే చెప్పానని చంద్రబాబు అన్నారు. ఒక్క అవకాశం అంటూ ఓటు వేస్తే.. విద్యుత్ తీగలని పట్టుకోవటమే అని ఆనాడే హెచ్చరించాను అన్నారు.

Tulasi Reddy: ప్రధానిగా రాహుల్ తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైలు పైనే: తులసి రెడ్డి

చంద్రబాబు అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి కార్యక్రమం జరిగింది. దేవుడితో సమానంగా ఆరాధించబడే కొందరిలో సేవాలాల్ మహారాజ్ ఒకరని చంద్రబాబు కొనియాడారు. మార్పు కోసం త్యాగానికి సైతం సిద్ధపడ్డ మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని ప్రశంసించారు.

Nandamuri Bala Krishna: పిలిచారు.. కానీ, జగన్‌ని కలవను -బాలకృష్ణ

లంబాడాలను అందరితో సమానంగా పైకి తెచ్చేందుకు తెలుగుదేశం కృషి చేస్తే.. ఏజెన్సీలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. లంబాడాల్లో మూఢ నమ్మకాలు రూపుమాపేందుకు తాము ఎంతో కృషి చేశామన్నారు చంద్రబాబు. లంబాడాలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది తెలుగుదేశమే అని చంద్రబాబు చెప్పారు. తాండాలను ప్రత్యేక పంచాయితీలుగా గుర్తించింది టీడీపీ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. గిరిజనుల ఆదాయం పెరిగేలా అరకు కాఫీకి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చామని చంద్రబాబు చెప్పారు.