AP EAPCET: విద్యార్థిని ఏడిపించిన ఒక్క నిమిషం, పరీక్షా కేంద్రంలోకి నో ఎంట్రీ

ఏపీ ఈఏపీసెట్‌ (EAPSET) ప్రవేశ పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడంతో ఓ విద్యార్థినీ అనుమతినివ్వలేదు. దీంతో అతను ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడు.

AP EAPCET: విద్యార్థిని ఏడిపించిన ఒక్క నిమిషం, పరీక్షా కేంద్రంలోకి నో ఎంట్రీ

Exam

EAPSET 2021 : ఒక్క నిమిషం ఆలస్యం విద్యార్థుల కొంపముంచుతోంది. పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్న విద్యార్థులకు నో ఎంట్రీ అంటున్నారు. పరీక్ష కేంద్రంలోకి అనుమతినివ్వకపోతుండడంతో విద్యార్థులు కన్నీళ్లు పెడుతున్నారు. తమను లోపలికి అనుమతినివ్వాలంటూ..ఎంత విజ్ఞప్తులు చేసినా..నో వే..అంటున్నారు. వారిని తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. చేసేదిమి లేక బిక్కుబిక్కుమంటూ వెళ్లిపోతున్నారు. తాజాగా..ఏపీ ఈఏపీసెట్‌ (EAPSET) ప్రవేశ పరీక్షల్లో కూడా ఇదే జరిగింది. పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడంతో ఓ విద్యార్థిని అనుమతినివ్వలేదు. దీంతో అతను ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడు.

Read More : Gorantla Butchaiah Chowdary : టీడీపీకి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య రాజీనామా?

2021, ఆగస్టు 19వ తేదీ గురువారం నుంచి ఈఏపీసెట్‌ (EAPSET) ప్రవేశ పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. 18, 19, 23, 24, 25 తేదీల్లో ఇంజనీరింగ్‌, సెప్టెంబరు 3, 6, 7 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సులకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తిచేసినట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణను జేఎన్‌టీయూ కాకినాడకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఏపీతో పాటు తెలంగాణలోని 120 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ప్రాథమిక కీని ఈ నెల 25న, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల కీని సెప్టెంబరు 7న విడుదల చేయనున్నారు.

Read More : Prakash Raj : వీరాభిమాని పాదయాత్ర.. విలక్షణ నటుడు ట్వీట్ వైరల్..

అయితే..ఓ విద్యార్థి ఆలస్యంగా రావడంతో అతడిని అక్కడున్న పోలీసు అనుమతించలేదు. దీంతో అతను ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడు. పరీక్ష నిర్వహణపై ఎగ్జామ్ చీఫ్ మణికంఠ 10tvతో మాట్లాడారు. గతంలో ఆఫ్ లైన్ పేపర్ పేపర్ ఉన్న సమయంలో..కొద్దిగా ఆలస్యమైనా అనుమతిచ్చే వాళ్లమని, కానీ..ప్రస్తుతం ఆన్ లైన్ లో బేస్డ్ గా ఎగ్జామ్ జరుగుతుందని వెల్లడించారు. సహాయం చేయాలని అనుకున్నా…అలా చేయలేమని, సర్వర్ లో ఆటోమెటిక్ గా వాళ్ల లాగిన్ క్లోజ్ అయిపోతుందని, ఎగ్జామ్ చేజారిపోతుందన్నారు. తప్పకుండా టైం చూసుకుని తొందరగా పరీక్షా కేంద్రానికి రావాలని విద్యార్థులకు సూచించారు.