AP PRC: పీఆర్సీపై మంత్రులతో ముగిసిన ఉద్యోగ సంఘాల కీలక భేటీ.. పరిష్కారం దిశగా సంకేతాలు..!

పీఆర్సీ వ్యవహారంపై.. మంత్రులతో ఏపీ ఉద్యోగ సంఘాల నేతల కీలక సమావేశం ముగిసింది. సుమారు నాలుగున్నర గంటలపాటు ఇరు వర్గాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.

AP PRC: పీఆర్సీపై మంత్రులతో ముగిసిన ఉద్యోగ సంఘాల కీలక భేటీ.. పరిష్కారం దిశగా సంకేతాలు..!

Prc Final

AP PRC: పీఆర్సీ వ్యవహారంపై.. మంత్రులతో ఏపీ ఉద్యోగ సంఘాల నేతల కీలక సమావేశం ముగిసింది. సుమారు నాలుగున్నర గంటలపాటు ఇరు వర్గాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అంతకుముందు.. తమ డిమాండ్లకు అంగీకరించకుంటే సమ్మె తప్పదన్న ఉద్యోగుల హెచ్చరికలను ఓ దశలో సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. చివరికి ఉద్యోగ సంఘాల నేతలతో మరోసారి చర్చలకు నిర్ణయించింది. ఆ మేరకు.. మంత్రుల బృందం పిలుపుతో.. ఉద్యోగ సంఘాల నేతలు మళ్లీ చర్చలకు హాజరయ్యారు. తమ డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ క్రమంలో.. తమ డిమాండ్లను ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం ముందుంచారు.

* పీఆర్సీ రిపోర్ట్ బయటపెట్టాలి
* ఫిట్ మెంట్ కనీసం 27శాతం తగ్గకుండా ఇవ్వాలి
* హెచ్ఆర్ఏ శ్లాబ్ రేట్లు పాతవే కొనసాగించాలి
* ఐదేళ్లకోసారి పీఆర్సీని అంగీకరించాలి
* సీసీఏను కొనసాగించాలి
* పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కొనసాగించాలి
* కాంట్రాక్ట్ ఉద్యోగులకు పే, డీఏ, హెచ్ఆర్ఏ, ఇంక్రిమెంట్లు ఇవ్వాలి
* ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం స్కేల్ ఇవ్వాలి
* గ్రామ సచివాలయ ఉద్యోగులకు అక్టోబర్ నుంచి రెగ్యులర్ స్కేల్ ఇవ్వాలి
* మార్చి 31లోగా.. సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలి
* స్టేట్ పీఆర్సీ కొనసాగించాలి

ఈ డిమాండ్లలో చాలా వాటికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా.. ఐదేళ్లకోసారి పీఆర్సీకి ప్రభుత్వం అంగీకరించినట్టుగా తెలుస్తోంది. చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి జగన్ కు శనివారం ఉదయం.. మంత్రుల బృందం నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. ఆ తర్వాత.. సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ చర్చలు, ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్న అంశాలపై.. అధికారిక ప్రకటన వస్తేనే.. వాస్తవాలపై స్పష్టత రానుంది. మరోవైపు.. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందన రాకుంటే.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఆదివారం అర్థరాత్రి (తెల్లవారితే సోమవారం) నుంచి సమ్మెకు దిగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.