AP Government : సిరివెన్నెల కుటుంబానికి ఏపీ సర్కార్ సాయం

ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి అండగా నిలవాలని సీఎం జగన్ నిర్ణయించారు.

AP Government : సిరివెన్నెల కుటుంబానికి ఏపీ సర్కార్ సాయం

Sirivennela

Sirivennela’s Family : ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి అండగా నిలవాలని సీఎం జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా..ఆయన ఆసుపత్రికి సంబంధించిన ఖర్చులు ఆ కుటుంబంపై పడకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ఖర్చులన్నీ సీఎ సహాయ నిధి నుంచి చెల్లిస్తున్నట్లు అధికారులు సీఎం జగన్ కు తెలియచేశారు. అంతేగాకుండా..సిరివెన్నెల కుటుంబానికి ఒక స్థలం ఇచ్చేలా పరిశీలన చేయాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

Read More : నా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ సిరివెన్నెల రాసినవే- దేవిశ్రీ ప్రసాద్

ఈ విషయంపై దివంగత సిరివెన్నెల పెద్ద కుమారుడు, సంగీత దర్శకుడు సాయి యోగేశ్వర్ స్పందించారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియచేస్తున్నామన్నారు. నవంబర్ 30వ తేదీన ఉదయం 10 గంటలకు కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న తమకు సీఎం కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందని, ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొనేందుకు వారు కాల్ చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని తెలియచేశారన్నారు. అదే రోజు సాయంత్రం 4.07 గంటలకు కన్నుమూసినట్లు, ఈ సందర్భంగా సీఎం జగన్ సంతాపాన్ని వ్యక్తపరచారన్నారు. తన తండ్రి అంత్యక్రియలకు ఏపీ సమాచార శాఖ మంత్ర పేర్నినాని హాజరై..ఆసుపత్రి ఖర్చులన్నీ భరిస్తున్నట్లు, తాము కట్టిన అడ్వాన్స్ ను కూడా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. ఇంత ప్రేమానురాగాలు చూపించి..తమ కుటుంబానికి అండగా నిలిచిన సీఎం జగ్ కు తమ కుటుంబం కృతజ్ఞతలు తెలియచేస్తోందని సాయి యోగేశ్వర్ తెలిపారు.

Read More : Sirivennela-NTR: నా ఏడుపును ఆయన కలమే వర్ణించాలి.. ఎన్టీఆర్ బాధ వెనుక కథ ఇదీ!

సిరివెన్నెల సీతారామశాస్త్రి 2021, నవంబర్ 30వ తేదీ సాయంత్రం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో సినీ పరిశ్రమ దిగ్ర్భాంతికి లోనైంది. తెలుగు సాహిత్యానికి, తెలుగు సినిమాకి ఎనలేని సేవ చేసిన ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటుగా వెల్లడించారు. ఆయన మరణానంతరం భౌతికకాయాన్ని హాస్పిటల్ లోనే ఉంచారు. 2021, డిసెంబర్ 01వ తేదీ బుధవారం ఉదయం సీతారామశాస్త్రి భౌతిక కాయాన్ని ఫిలింఛాంబర్ వద్దకు తరలించారు. అక్కడ సినీ ప్రముఖులు, ఇతరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అక్కడ సిరివెన్నెలకు కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.