AP High Court : జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలపై హైకోర్టు తీర్పు

జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలపై ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించనుంది. ఎన్నికలకు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ..ఏప్రిల్ 01వ తేదీన ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిందంటూ..టీడీపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు.

AP High Court : జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలపై హైకోర్టు తీర్పు

Ap High Court

ZPTC, MPTC  Election : జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలపై ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించనుంది. ఎన్నికలకు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ..ఏప్రిల్ 01వ తేదీన ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిందంటూ..టీడీపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జ్ ఏప్రిల్ 01వ తేదీన ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా..జరిగే…తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ..ఎస్ఈసీకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు ఆదేశాలను ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు.. ధర్మాసనం ముందు అప్పీల్ చేయడంతో… ఎన్నికల నిర్వాహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే…ఓట్ల లెక్కింపు..ఫలితాలపై ప్రకటన చేయొద్దని స్పష్టం చేసింది న్యాయస్థానం. పిటిషన్ పై లోతైన విచారణ కోసం సింగిల్ జడ్జ్ కు అప్పగించింది. మరోవైపు గత ఏడాది..నామినేషన్ల సందర్భంగా.. బలవంతపు ఉపసంహరణలు జరిగాయని, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించాలని కోరుతూ..జనసేన, బీజేపీ నేతలు పిటిషన్లు వేశారు.

అన్ని పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి..ఈనెల 04వ తేదీన తీర్పును రిజర్వ్ చేశారు. హైకోర్టు ఇచ్చే తీర్పుతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ పై క్లారిటీ రానుంది.

Read More : Salman Khan: కొవిడ్ పేషెంట్ల కోసం 500 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఏర్పాటు చేసిన సల్మాన్ ఖాన్