AP MDC: అమెరికా బారైట్ మార్కెట్ పై ఏపీ ఎండీసీ ద్రుష్టి: 3 కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

బారైట్ ఎగుమతులపై దృష్టిపెట్టిన ఏపీ మైనింగ్ శాఖ (ఏపీఎండీసీ )..ఆమేరకు విదేశాల్లో ఉన్న డిమాండ్ ను అందిపుచ్చుకోవాలని చూస్తుంది.

AP MDC: అమెరికా బారైట్ మార్కెట్ పై ఏపీ ఎండీసీ ద్రుష్టి: 3 కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

Baryte

AP MDC: ఆంధ్రప్రదేశ్ లో సహజ వనరులే పెట్టుబడిగా..రాష్ట్రానికి ఆదాయం పెంచే మార్గాలను అన్వేషిస్తుంది ప్రభుత్వం. ఈక్రమంలో బారైట్(Baryte) ఎగుమతులపై దృష్టిపెట్టిన ఏపీ మైనింగ్ శాఖ (ఏపీఎండీసీ)..ఆమేరకు విదేశాల్లో ఉన్న డిమాండ్ ను అందిపుచ్చుకోవాలని చూస్తుంది. బారైట్ ఖనిజ ఎగుమతులపైనా ద్రుష్టి పెట్టిన ఏపీఎండీసీ..అమెరికాకు బారైట్ ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈనేపధ్యంలో ఏపీ మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఏపీఎండీసీ వైస్ చైర్మన్ అండ్ ఎండి విజి వెంకటరెడ్డి సోమవారం అమెరికన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హౌస్టన్ లో జరిగిన సమావేశానికి వీరు హాజరయ్యారు. ఈసందర్భంగా పలు అమెరికన్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన అధికారులు..మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో తొలిసారి 3 అమెరికన్ కంపెనీలతో ఎంఓయులు కుదుర్చుకున్నారు.

Other Stories:GVL Narasimharao: చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది: ఎంపీ జీవిఎల్

దాదాపు రూ. 750 కోట్ల మేర బెరైటీస్ విక్రయాలకు ఒప్పందం కుదిరింది. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ దేశాల్లో మంగంపేట బెరైటీస్ కు డిమాండ్ ఉంది. అమెరికా వంటి దేశాల్లోనూ మార్కెట్ వాటా పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఏపీఎండీసీ ఈ ఒప్పందాలు కుదుర్చుకుంది. అమెరికన్ మార్కెట్ లో ఏటా 30 లక్షల టన్నుల బైరటీస్ కు డిమాండ్ ఉన్నట్లు ఖనిజాభివృద్ధిశాఖ అంచనా వేసింది. ఈక్రమంలో మరో రూ.250 కోట్ల విలువైన ఎంఓయులు కుదిరే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సి, డి అండ్ డబ్ల్యు గ్రేడ్ ఖనిజం విక్రయానికి మంచి అవకాశం ఉంది. మొరాకో, చైనా, మెక్సికో దేశాలు సైతం అమెరికాకు బైరటీస్ ఎగుమతి చేస్తుండగా ఆయా దేశాల ధరలతో పోటీ పడనుంది ఏపీ ఎండీసీ. తక్కువ రేటుకే ఖనిజాన్ని అందించడం ద్వారా అమెరికన్ మార్కెట్ లో సుస్థిర స్థానంకు యత్నిస్తుంది ఏపీ ఎండీసీ.