Kotamreddy Sridhar Reddy Cries : మంత్రి పదవి రాలేదని వెక్కి వెక్కి ఏడ్చిన ఎమ్మెల్యే

ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ కొందరిలో సంతోషం నింపితే మరికొందరిలో బాధ నింపింది. పదవి దక్కనోళ్లు..

Kotamreddy Sridhar Reddy Cries : మంత్రి పదవి రాలేదని వెక్కి వెక్కి ఏడ్చిన ఎమ్మెల్యే

Kotamreddy Sridhar Reddy Cries

Kotamreddy Sridhar Reddy Cries : ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ కొందరిలో సంతోషం నింపితే మరికొందరిలో బాధ నింపింది. పదవి దక్కినవాళ్లు ఆనందంగా ఉంటే పదవి దక్కనోళ్లు కన్నీళ్లు పెడుతున్నారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ కొందరిని కన్నీళ్లు పెట్టిస్తోంది.

కేబినెట్ లో చోటు దక్కలేని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనస్తాపం చెందారు. ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. నెల్లూరు జిల్లా నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి జగన్ కేబినెట్ లో చోటు దక్కలేదు. మంత్రి పదవి ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అవన్నీ ఆవిరయ్యాయి. ఆయనకు మినిస్టర్ పదవి దక్కలేదు. దీంతో కోటంరెడ్డి కంటతడి పెట్టారు.(Kotamreddy Sridhar Reddy Cries)

నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఆశించారు. ముగ్గూరు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

AP New Cabinet : ఏపీ నూతన కేబినెట్ జాబితా విడుదల.. కొత్త మంత్రులు వీరే

అయితే, ఈ ముగ్గురిలో కాకాణికి సీఎం జగన్ కేబినెట్ లో ఛాన్స్ ఇచ్చారు. కేబినెట్ లో తనకు అవకాశం ఇస్తారని కోటంరెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాను సీనియర్ ని అని, జగన్ తనకు కచ్చితంగా పదవి ఇస్తారని ఆయన ఆశించారు. అయితే, కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో ఆయన హర్ట్ అయ్యారు. తీవ్రమైన ఆవేదనతో ఏకంగా వెక్కి వెక్కి ఏడ్చేశారు.(Kotamreddy Sridhar Reddy Cries)

కాగా, తనకు మంత్రి పదవి రాకపోవడంపై కోటంరెడ్డి స్పందించారు. మంత్రి పదవి రాకపోవడం తనను బాధించిందన్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశానని చెప్పారు. మంత్రి పదవి రాకపోయినా జగనన్న సైనికుడిగా పని చేస్తానని కోటంరెడ్డి తెలిపారు. జగన్ నిర్ణయాన్ని అందరం పాటించాల్సిందే అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి భక్తుడిగా, వైఎస్ జగనన్న సైనికుడిగా, ప్రజా ఉద్యమకారుడిగా తూచా తప్పకుండా జగన్ నిర్ణయాన్ని ఆమోదించాల్సిందే అన్నారు. సోమవారం నుంచి గడప గడపకి జగనన్న మాట, కోటంరెడ్డి బాట కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందన్నారు.

Balineni : కేబినెట్ పునర్‌ వ్యవస్థీకరణపై బాలినేని తీవ్ర అసంతృప్తి

ఉత్కంఠకు తెరపడింది. కొత్త కేబినెట్ రూపుదిద్దకుంది. మూడు రోజులుగా మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణపై కసరత్తు చేసిన సీఎం జగన్‌.. ఆదివారం తుది జాబితాను ఖరారు చేశారు. కేబినెట్ లో 25 మందికి చోటు దక్కింది. నూతన మంత్రివర్గం సోమవారం ఉదయం కొలువుదీరనుంది. ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కనే ఉన్న పార్కింగ్‌ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.(Kotamreddy Sridhar Reddy Cries)

మంత్రి వర్గం జాబితా
* శ్రీకాకుళం
ధర్మన ప్రసాద రావు (వెలమ)
సీదిరి అప్పలరాజు (మత్యకార)

* విజయనగరం
బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు)

* పార్వతీపురం
రాజన్న దొర (ఎస్టీ)

* అనకాపల్లి
గుడివాడ అమర్నాథ్ (కాపు)
ముత్యాలనాయుడు (కొప్పుల వెలమ)(Kotamreddy Sridhar Reddy Cries)

* కాకినాడ జిల్లా
దాడిశెట్టి రాజా (కాపు)

* కోనసీమ జిల్లా
పినిపె విశ్వరూప్‌ (ఎస్సీ)
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (బీసీ – శెట్టి బలిజ)

* తూర్పుగోదావరి జిల్లా
తానేటి వనిత (మాదిగ – ఎస్సీ)

* పశ్చిమ గోదావరి జిల్లా
కారుమూరి నాగేశ్వరరావు (యాదవ – బీసీ)
కొట్టు సత్యనారాయణ (కాపు)(Kotamreddy Sridhar Reddy Cries)

* కృష్ణా జిల్లా
జోగి రమేష్ (గౌడ – బీసీ)

* పల్నాడు జిల్లా
అంబటి రాంబాబు (కాపు)

* బాపట్ల జిల్లా
మేరుగ నాగార్జున (ఎస్సీ)

* గుంటూరు
విడదల రజని (బీసీ)

* ప్రకాశం జిల్లా
ఆదిమూలపు సురేశ్‌ (ఎస్సీ)

* నెల్లూరు జిల్లా
కాకాణి గోవర్ధన రెడ్డి (ఓసీ – రెడ్డి)

* కడప జిల్లా
అంజద్‌ బాషా (మైనార్టీ)

* నంద్యాల జిల్లా
బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి (ఓసీ – రెడ్డి)

* కర్నూలు జిల్లా
గుమ్మనూరు జయరాం (బీసీ – బోయ)

* చిత్తూరు జిల్లా
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఓసీ – రెడ్డి)
నారాయణ స్వామి (ఎస్సీ)
ఆర్కే రోజా (ఓసీ – రెడ్డి)(Kotamreddy Sridhar Reddy Cries)

* అనంతపురం
ఉషా శ్రీ చరణ్‌ (కురుమ బీసీ)