Bhumana Followers Resign : వైసీపీలో కేబినెట్ చిచ్చు.. తిరుపతిని తాకిన అసమ్మతి సెగ, పదవులకు రాజీనామా

ఏపీలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ అధికార వైసీపీలో చిచ్చు రాజేసింది. తాడేపల్లిలో మొదలైన అసమ్మతి సెగ ఇప్పుడు(Bhumana Followers Resign)

Bhumana Followers Resign : వైసీపీలో కేబినెట్ చిచ్చు.. తిరుపతిని తాకిన అసమ్మతి సెగ, పదవులకు రాజీనామా

Bhumana Followers Resign

Bhumana Followers Resign : ఏపీలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ అధికార వైసీపీలో చిచ్చు రాజేసింది. మంత్రి పదవి దక్కినోళ్లు ఫుల్ ఖుషీగా ఉంటే పదవి దక్కనోళ్లు ఆవేదనతో రగలిపోతున్నారు. పదవి ఆశించి భంగపడ్డ నాయకులు, వారి అనుచరులు బాహాటంగానే అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు. తాడేపల్లిలో మొదలైన అసమ్మతి సెగ ఇప్పుడు తిరుపతిని కూడా తాకింది.

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డికి కేబినెట్ లో చోటు దక్కకపోవడంతో ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూకుమ్మడిగా రాజీనామాలకు పాల్పడుతున్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కో-ఆప్షన్ మెంబర్ పదవులకు భూమన అనుచరులు శ్రీదేవి, నవాజ్ భాషా రాజీనామా చేశారు. పార్టీని నమ్ముకుని పార్టీ కోసమే పని చేస్తున్నా తమ నాయకుడికి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం బాధాకరం అంటూ భూమన అనుచరులు నిరసన గళం విప్పుతున్నారు. తమ పదవులకు వారు రాజీనామా చేశారు.(Bhumana Followers Resign)

మంత్రివ‌ర్గ పునర్ వ్యవ‌స్థీక‌ర‌ణ వైసీపీ సీనియ‌ర్ల‌లో అసంతృప్తికి కారణమైంది. గ‌త కేబినెట్‌లో కీల‌క మంత్రిగా కొన‌సాగి.. తాజా మంత్రివ‌ర్గ పున‌ర్ వ్యవస్థీకరణలో చోటు ద‌క్క‌ని తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి అల‌క వీడ‌లేదు. ఇప్ప‌టికే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు సజ్జ‌ల రామకృష్ణారెడ్డి రెండు ప‌ర్యాయాలు ఆయన ఇంటికి వెళ్లినా బాలినేని అల‌క వీడ‌లేదు.

Sajjala Ramakrishna Reddy: ఎవ్వరిలో అసంతృప్తి లేదు, అంతా సమసిపోతుంది: సజ్జల రామకృష్ణ రెడ్డి

తాజాగా సోమ‌వారం ఉద‌యం ముచ్చ‌ట‌గా మూడో ప‌ర్యాయం కూడా బాలినేని ఇంటికి స‌జ్జ‌ల వెళ్లారు. ఈసారి స‌జ్జ‌ల వెంట పార్టీ సీనియ‌ర్లు గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, త‌ల‌శిల ర‌ఘురాంతో పాటు పెద్ద సంఖ్య‌లో పార్టీ నేత‌లు బాలినేని ఇంటికి త‌రలివెళ్లారు. జ‌గ‌న్ ఆదేశం మేర‌కే బాలినేని ఇంటికి మూడోమారు వ‌చ్చిన స‌జ్జ‌ల‌.. జ‌గ‌న్ ఆదేశించిన‌ట్లుగా బాలినేనిని తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యానికి తీసుకెళ్ల‌నున్నారు. బాలినేనితో స్వ‌యంగా మాట్లాడాలని నిర్ణ‌యించుకున్న జ‌గ‌న్‌.. ఆ మేర‌కు బాలినేనిని త‌న దగ్గరికి తీసుకురావాల‌ని స‌జ్జ‌ల‌ను పంపిన‌ట్లుగా వార్త‌లు వస్తున్నాయి.(Bhumana Followers Resign)

Minister Roja Thanks CM Jagan : సీఎం జగన్ చేతిని ముద్దాడిన మంత్రి రోజా

మరోసారి మంత్రి పదవి రాకపోవడంతో మాజీ హోం మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత కూడా మనస్తాపం చెందారు. ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మొన్నటిదాకా రాష్ట్ర హోం మంత్రిగా ఉన్న ఆమెకు.. ఈసారి కేబినెట్ బెర్త్ దక్కలేదు. ఈ క్రమంలోనే ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

ఈ విషయాన్ని సుచరిత అధికారికంగా ప్రకటించారు. కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీలోని కార్యకర్తలెవరూ రాజీనామా చేయవద్దని, పార్టీకి నష్టం చేయవద్దని సూచించారు. అయితే, ఆమెకు మద్దతుగా ప్రత్తిపాడులో కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేశారు.

AP Cabinet: శాఖలు ఖరారు.. ఐదుగురికి డిప్యూటీ సీఎంగా చాన్స్.. హోం మంత్రిగా తానేటి వనిత..!