Ap : ఆన్‌లైన్ సినిమా టికెట్ల వ్యవహారం..రాజకీయ రచ్చ

ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల వ్యవహారం ఏపీలో దుమారం లేపుతోంది. విమర్శలు.. ప్రతివిమర్శలు.. వ్యక్తిగత విమర్శలకు సైతం దారితీస్తోంది.

Ap : ఆన్‌లైన్ సినిమా టికెట్ల వ్యవహారం..రాజకీయ రచ్చ

Perni Nani

Updated On : September 30, 2021 / 6:43 AM IST

Ap Online Movie Tickets : ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల వ్యవహారం ఏపీలో దుమారం లేపుతోంది. విమర్శలు.. ప్రతివిమర్శలు.. వ్యక్తిగత విమర్శలకు సైతం దారితీస్తోంది. పార్టీలు, సినిమా పరిశ్రమ సైతం కలరవపాటుకు గురవుతున్నాయి. సినిమా టెక్కెట్లను పోర్టల్ ద్వారా అమ్మాలన్న నిర్ణయాన్ని సినీ ప్రముఖుల విన్నపం మేరకే తీసుకున్నామంటోంది ప్రభుత్వం. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మాత్రం దీన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇదే రాజకీయ రచ్చకు కారణమైంది. వ్యవహారం వైసీపీ వర్సెస్ జనసేనగా మారింది. పవన్ విమర్శలకు మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ సైతం ఘాటుగా మాట్లాడటంతో మంత్రులు సైతం అదే స్థాయిలో స్వరం పెంచుతున్నారు.

Read More : Srisailam Temple : గుడ్ న్యూస్, సామాన్య భక్తులకు స్పర్శ దర్శనం

టికెట్లపై రాజకీయ దుమారం రేగడంతో.. అప్రమత్తయ్యారు సినీ ప్రముఖులు. హడావుడిగా మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. పవన్ వ్యాఖ్యలకు సినీ పరిశ్రమకు అస్సలు సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఓవైపు పవన్, మరోవైపు ప్రభుత్వం హోరాహోరీగా తలపడే పరిస్థితులు ఏర్పడటంతో.. సినీ ఇండస్ట్రీకి డ్యామేజ్ అవకుండా జాగ్రత్త పడుతున్నారు సినిమా పెద్దలు. పవన్ వ్యాఖ్యలపై సినీపరిశ్రమకు భయం పట్టుకుంది. సినిమా టిక్కెట్ల వ్యవహారంపై మూకుమ్మడిగా ప్రభుత్వం ఎలా చెపితే అలా నడుచుకుంటామని ముక్తకంఠంతో చెపుతున్నారు. ఇప్పటికి రెండుసార్లు మంత్రి పేర్ని నానితో సినీరంగ ప్రముఖులు సమావేశమయ్యారు.

Read More : BAJAJ CHETAK : మరోసారి భారీగా ధర పెంపు, దేశంలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

రెండుసార్లు కూడా పోర్టల్ ద్వారా సినిమా టిక్కెట్లు విక్రయించమని తామే ప్రభుత్వాన్ని కోరినట్లు నిర్మాతలు తేల్చిచెప్పారు. గతంలో కూడా చిరంజీవి, నాగార్జున, రాజమౌళి సీఎం జగన్‌ను కలిశారు. ఇటీవల మరోసారి ముఖ్యమంత్రిని కలవాలని ఆశించారు. కానీ ఎందుకో సాధ్యం కాలేదు. ఈలోగా సినిమా టిక్కెట్ల వ్యవహారం తెరమీదకు వచ్చింది. రకరకాల మలుపులు తీసుకుంది. దీంతో మరోసారి ముఖ్యమంత్రిని కలిసే అవకాశాన్ని సినీరంగ ప్రముఖులు కోల్పోయినట్లయింది. దీంతో మంత్రి పేర్ని నానిని కలిసి వారి సమస్యలు చెప్పుకోవాల్సి వచ్చింది.