AP : అధిష్టానంపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్..‘నన్ను ఒకవైపే చూసారు..రెండో వైపు చూస్తే తట్టుకోలేరు..నేనేంటో చూపిస్తా’..

అధిష్టానంపై పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. .‘నన్ను ఒకవైపే చూసారు..రెండో వైపు చూస్తే తట్టుకోలేరు..నేనేంటో చూపిస్తా’..దెబ్బకొట్టి చూపిస్తా’..

AP : అధిష్టానంపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్..‘నన్ను ఒకవైపే చూసారు..రెండో వైపు చూస్తే తట్టుకోలేరు..నేనేంటో చూపిస్తా’..

Payakaraopeta Mla Golla Baburao Interesting Comments

payakaraopeta mla Golla baburao interesting comments : రెండో విడత మంత్రి వర్గ విస్తరణ సందర్భంగా పుట్టిన సెగలు వైసీపీలో ఏమాత్రం చల్లారటంలేదు సరికదా ఇంకా పెరుగుతున్నాయి. మంత్రి పదవి వస్తుందని గంపెడాశ పెట్టుకున్న ఆశావహులు తీవ్రఅసంతృప్తులతో రగిలిపోతున్నారు. దీంట్లో భాగంగా..ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు తనకు మంత్రి పదవి రాకపోవడంపై పార్టీ అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సజ్జలకు చెప్పాల్సింది అంతా చెప్పానని కానీ నాకు మంత్రి పదవి దక్కకుండా చేశారు అంటూ తీవ్రంగా మండిపడ్డారు బాబూరావు. నాకు మంత్రి పదవి కొంతమంది నన్ను దెబ్బకొట్టారని వాళ్లను ఏమాత్రం విడిచిపెట్టను..సమయం వచ్చినప్పుడు తిరిగి దెబ్బ కొట్టి తీరుతాను అంటూ సజ్జలపైనా అధిష్టానం పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు గొల్ల బాబూరావు. అంతేకాదు ‘నేను సాఫ్ట్ అనుకుంటున్నారేమో..కానీ నేను చాలా రఫ్..హింసావాదిని జాగ్రత్త అంటూ వైసీపీ అధిష్టానికి వార్నింగ్ ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయారు కావట్టే నేను కాంగ్రెస్ విడిచి వైసీపీలోకి వెళ్లానని తెలిపారు.

Also read :Anilkumar Yadav: నెల్లూరులో ఫ్లెక్సీల రగడ: స్పందించిన మాజీ మంత్రి అనిల్ కుమార్
తనకు మంత్రి పదవి రాకుండా అధిష్టానం అడ్డుకుందని.. అవకాశం వచ్చినప్పుడు తానేంటో చూపిస్తాంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో గ్రామ వార్డు వాలంటీర్ సేవలకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్న సందర్భంగా గొల్ల బాబూరావు వైసీపీ అధిష్టానంపై అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేస్తూ..ప్రభుత్వం ప్రశపెట్టే ప్రతి సంక్షేమ పథకం లబ్ధిదారులకు చేకూరాలనే ఉద్దేశంతో సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ అంటే జనాలకు సేవ చేసే ఒక సైన్యం లాంటిదని అన్నారు. సీఎం జగన్ ఆశయం నెరవేరాలంటే వాలంటరీ వ్యవస్థ మీద ఆధారపడి ఉందన్నారు.

Also read :Corona Rising in India: ఢిల్లీలో కరోనా డేంజర్ బెల్స్: పరిస్థితిపై డీడీఎంఏ సమీక్ష

సమావేశ అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే బాబురావు స్పందిస్తూ.. ఒక మాట కోసం తాను వైఎస్సార్సీపీలో చేరానని.. వైఎస్సార్ చనిపోయిన వైసీపీలో జాయిన్ అయ్యాయని చెప్పారు. పార్టీ కోసం తాను ఎన్నో త్యాగాలు చేశానని.. అయితే తనను అమాయకుడిగా భావించి నేడు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. తాను అమాయకుడిని కాదని.. అవకాశం వచ్చినప్పుడు తానేంటో చూపిస్తానని అన్నారు. మంత్రి పదవి రాకుండా అధిష్టానం దెబ్బకొట్టిందని.. తాను కూడా దెబ్బ కొట్టి చూపిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.