Anilkumar Yadav: నెల్లూరులో ఫ్లెక్సీల రగడ: స్పందించిన మాజీ మంత్రి అనిల్ కుమార్

నెల్లూరులో ఫ్లెక్సీల రగడ కాక రేపుతోంది. ప్రతిపక్ష నేతలు ఫ్లెక్సీలు సహా అధికార పార్టీ నేతల ఫ్లెక్సీలు సైతం తొలగించడంపై నెల్లూరులో రాజకీయ వర్గపోరు రాజుకుంది.

Anilkumar Yadav: నెల్లూరులో ఫ్లెక్సీల రగడ: స్పందించిన మాజీ మంత్రి అనిల్ కుమార్

Anil Kumar

Updated On : April 19, 2022 / 10:22 AM IST

Anilkumar Yadav: నెల్లూరులో ఫ్లెక్సీల రగడ కాక రేపుతోంది. ప్రతిపక్ష నేతలు ఫ్లెక్సీలు సహా అధికార పార్టీ నేతల ఫ్లెక్సీలు సైతం తొలగించడంపై నెల్లూరులో రాజకీయ వర్గపోరు రాజుకుంది. అధికార వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరులోని పలు ప్రాంతాల్లో అభిమానులు, అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. అయితే ఆ ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. అదే సమయంలో దివంగత నేత ఆనం వివేకానంద రెడ్డి జయంతి పురస్కరించుకుని కూడా నెల్లూరు నగరంలో పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా వాటిని కూడా మునిసిపల్ సిబ్బంది తొలగించారు. అయితే ఫ్లెక్సీల తొలగింపుపై ఆయా నేతల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో నెల్లూరు నగర పరిధిలో నేతల ఫ్లెక్సీల తొలగింపుపై మాజీ మంత్రి అనిల్ కుమార్ స్పందించారు.

Also read:Minister RK Roja: నాది, బాలకృష్ణతో సక్సెస్ ఫుల్ కాంబినేషన్: మంత్రి ఆర్.కె.రోజా

నెల్లూరులో ఆయన మాట్లాడుతూ సిటీలో ఫ్లెక్సీలు వేయకూడదనే నిబంధన ఎప్పటి నుంచో ఉందని..గతంలో నా ఫ్లెక్సీలు కూడా వేయనివ్వలేదని అన్నారు. గతంలో ఆనం వివేకా జయంతి సందర్భంగా వేసిన ఫ్లెక్సీలు కూడా తొలగించామని, ఈక్రమంలోనే కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీలను తొలగించారని అనిల్ కుమార్ చెప్పుకొచ్చారు. మునిసిపల్ శాఖ ఆధ్వరంలో ఉన్న హోర్డింగ్స్ పై అధికారికంగా వేసిన ఫ్లెక్సీలపై ఎలాంటి అభ్యంతరం లేదని..అయితే కొన్ని హోర్డింగ్స్ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసినట్లు అనిల్ కుమార్ తెలిపారు.

Also read:Sadhvi Rithambara: నలుగురు పిల్లల్ని కనండి, ఇద్దరినీ దేశానికి ఇవ్వండి: సాధ్వి రితంబర వివాదాస్పద వ్యాఖ్యలు

ఇక ఇటీవల సర్వేపల్లిలో అనిల్ పర్యటన పై వచ్చిన విమర్శలపై ఆయన స్పందిస్తూ..”సర్వేపల్లిలో నా పర్యటన నా వ్యక్తిగతం” అని అన్నారు. “నా నియోజకవర్గంలో మిగిలిన ఎమ్మెల్యేలు కార్యక్రమాలకు రావొచ్చు..నేను సర్వేపల్లికి వెళ్లకూడదా?” అని అనిల్ కుమార్ ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా పరిధిలో నీటి ప్రాజెక్టులు జరగలేదని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి ఎందుకన్నారో తనకు తెలియదన్న అనిల్ కుమార్, రూ.5 కోట్లతో అక్కడ ప్రాజెక్టులని శాంక్షన్ చేసినట్లు పేర్కొన్నారు. అసంతృప్తి వ్యక్తం చేసిన నియోజకవర్గాల్లోనే రూ.వందల కోట్ల పనులు కేటాయింపు జరిగిందని అనిల్ వివరించారు.

Also read:Minister KTR: గుడి, మసీదు, చర్చి కూడా కడతాం – కేటీఆర్