AP PRC Issue : చర్చలు షురూ… పీఆర్సీ సాధన సమితితో సంబంధం లేకుండా

పీఆర్సీతో సంబంధం లేకుండా ప్రభుత్వంతో కొన్ని సంఘాలు చర్చిస్తున్నాయి. సమావేశంలో వారి వారి వాదనలు వినిపిస్తున్నాయి. గుర్తింపు పొందిన సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేవన

AP PRC Issue : చర్చలు షురూ… పీఆర్సీ సాధన సమితితో సంబంధం లేకుండా

Ap Prc

AP Government Employees Services Association : ఏపీలో పీఆర్సీ వివాదం ఇంకా సద్దుమణగలేదు. అయితే.. ఓ అడుగు మాత్రం ముందుకు పడిందని చెప్పవచ్చు. పీఆర్సీపై ఏర్పాటైన మంత్రుల కమిటీతో గవర్నమెంట్ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తొలిసారిగా చర్చలకు ఈ అసోసియేషన్ భేటీ కావడం గమనార్హం. పీఆర్సీతో సంబంధం లేకుండా ప్రభుత్వంతో కొన్ని సంఘాలు చర్చిస్తున్నాయి. సమావేశంలో వారి వారి వాదనలు వినిపిస్తున్నాయి. గుర్తింపు పొందిన సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేవనే సంగతి తెలిసిందే. తమ డిమాండ్లు పరిష్కరిస్తేనే చర్చలకు వస్తామని ఖరాఖండిగా చెప్పిన సంగతి తెలిసిందే. పాత జీతాలు వేయడంతో పాటు పలు డిమాండ్స్ వినిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు రాకపోవడంతో ఆయా ప్రభుత్వ సంఘాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

Read More : Nirmala Sitaraman: హల్వా సెలబ్రేషన్ లేకుండానే కేంద్ర బడ్జెట్..

మరోవైపు…ఉద్యోగులు చర్చలకు వస్తామని రాకపోవడంతో.. మంత్రుల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్సనల్‌గా ఫోన్ చేసినా.. రాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. డిమాండ్లు పెట్టి.. ఉద్యోగ సంఘాలు ఎక్కడో కూర్చుంటే సమస్య పరిష్కారం కాదన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పరిస్థితులు చేయిదాటక ముందే.. సమస్య పరిష్కరించుకుందామన్నారు. కొన్ని చోట్ల ఆర్థిక అంశాలకు సంబంధించిన ఫైల్స్ ఆపడం.. క్రమశిక్షణ ఉల్లంఘనే అన్నారు. ఇలాంటి చర్యలు సరికాదన్నారు సజ్జల. ప్రతిరోజు 12 గంటలకు వచ్చి ఉద్యోగుల కోసం ఎదురుచూస్తామన్నారు. పీఆర్సీ సాధన సమితి ఒక్కటే కాదు.. ఉద్యోగ సంఘాల్లో ఎవరొచ్చినా చర్చలు జరుపుతామన్నారు. సమ్మెకు వెళ్లే ఒకరోజు ముందు వచ్చినా చర్చలు జరుపుతామన్నారు సజ్జల. తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ఫిబ్రవరి 3న చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. లక్షలాది మంది ఉద్యోగులు తరలిరావాలని కోరాయి.