Nirmala Sitaraman: హల్వా సెలబ్రేషన్ లేకుండానే కేంద్ర బడ్జెట్..

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆనవాయితీగా చేపట్టే హల్వా సెలబ్రేషన్ ఈ సారి కూడా లేనట్లే. మరోసారి డిజిటల్ గానే (కాగిత రహిత) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా.

Nirmala Sitaraman: హల్వా సెలబ్రేషన్ లేకుండానే కేంద్ర బడ్జెట్..

budjet

Nirmala Sitaraman: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆనవాయితీగా చేపట్టే హల్వా సెలబ్రేషన్ ఈ సారి కూడా లేనట్లే. మరోసారి డిజిటల్ గానే (కాగిత రహిత) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశవ్యాప్తంగా మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్… పన్ను ప్రతిపాదనలు, ఆర్థిక నివేదికల ప్రదర్శనకు సంబంధించిన అన్ని పత్రాలను ప్రింట్ ద్వారానే ప్రవేశపెట్టేవారు. కరోనా నేపథ్యంలో డిజిటల్ రూపంలో మాత్రమే బడ్జెట్‌ను రూపొందించారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాలుగో బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2022న ప్రవేశపెట్టనున్నారు.

అధికారుల సమాచారం ప్రకారం.. కొవిడ్ కారణంగా బడ్జెట్ పత్రాలను ఈసారి కూడా ముద్రించడం జరగదు. బడ్జెట్ పత్రాలు ఎక్కువగా డిజిటల్ రూపంలోనే అందుబాటులో ఉంటాయని తెలిపారు. భౌతికంగా కొన్ని కాపీలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.

Read Also: అదిరే ఆఫర్స్.. ఓటీటీ బాటలో మినిమం బడ్జెట్ మూవీస్!

గతంలో బడ్జెట్ పత్రాలను ముద్రించేందుకు చాలా విస్తృతమైన ప్రక్రియ ఉండేది. ప్రింటింగ్ కార్మికులు నార్త్ బ్లాక్‌లోని ‘బేస్‌మెంట్’లో కొన్ని వారాల పాటు ప్రింటింగ్ ప్రెస్‌లో ఉండేవారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంచి బడ్జెట్ పత్రాన్ని ముద్రించే పని పూర్తి చేసేవారు.

సంప్రదాయ ‘హల్వా వేడుక’తో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి, మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు హాజరయ్యేవారు.

కరోనా మహమ్మారి కారణంగా లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు ఇచ్చే కాపీలను తగ్గించి గ్రీన్ బడ్జెట్ పేరిట డిజిటల్ ప్రతులను సభ్యుల ట్యాబ్ లకు పంపుతున్నారు. ప్రస్తుత ఏడాది ఒమిక్రాన్ భయంతో మరిన్ని పరిమితులు విధించారు. ఇందులో భాగంగానే సాంప్రదాయ హల్వా వేడుక కూడా రద్దు చేశారు.