మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసి చనిపోయిన వారి స్థానంలో నామినేషన్లు వేసేందుకు అనుమతి

మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసి చనిపోయిన వారి స్థానంలో నామినేషన్లు వేసేందుకు అనుమతి

AP SEC a key decision : మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లపై ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసి చనిపోయిన వారి స్థానంలో నామినేషన్లు వేసేందుకు రాజకీయ పార్టీలకు అవకాశం కల్పిస్తూ ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏడు రోజులు గడువిచ్చింది. ఈ నెల 28 మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ వేసేందుకు వెసులుబాటు కల్పించింది.

రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన 56 మంది మృతి చెందినట్టు ఎస్ఈసీ పేర్కొంది. వైసీపీ తరపున పోటీ చేసిన వాళ్లు 28 మంది, టీడీపీ నుంచి 17 మంది, బీజేపీ నుంచి ఐదుగురు, సీపీఐ నుంచి ముగ్గురు, కాంగ్రెస్‌ వాళ్లు ఇద్దరు, జనసేన అభ్యర్థి ఒకరు చనిపోయినట్లు వెల్లడించింది. చనిపోయిన వాళ్ల స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించాలంటూ రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేయడంతో ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.