AP : పూళ్లలో వింత వ్యాధి..ఫిట్స్ తో పడిపోతున్న జనాలు

AP : పూళ్లలో వింత వ్యాధి..ఫిట్స్ తో పడిపోతున్న జనాలు

AP west godavari pulla villege people mysterious disease : పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం అయిన ఏలూరులో కొన్ని రోజుల వింత వ్యాధి ఘటనలు మరచిపోకముందే ఏలూరుకు సమీపంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమడోలు మండలంలో అంతుచిక్కని వింత వ్యాధి కలకలం రేపింది. పూళ్ల గ్రామంలో వింత వ్యాధి భయాందోళనలకు గురిచేస్తోంది.

రోడ్లమీద నడుస్తూ నడుస్తూనే జనాలు ఉన్నట్లుండి ఫిట్స్ వచ్చి పడిపోతున్నారు. దీంతో ఏమవుతుందో తెలీక స్థానికులు భయపడిపోతున్నారు. రోజు రోజుకూ వింత వ్యాధి బాధితుల సంఖ్యపెరుగుతోంది. ఫిట్స్ తో బాధపడుతూ ఇప్పటి వరకూ 25మంది బాధితులు హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నారు.

పూళ్ల గ్రామంలో బాధితులు ఉన్నట్లుండి కింద పడిపోతున్నట్లు స్థానికులు తెలిపారు. దీనిపై డాక్టర్లు మాత్రం ఫుడ్‌పాయిజన్ వల్లే ఇలా జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. కానీ..ఫుడ్ పాయిజన్ అంతమందికి ఒకేసారి జరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ తరహా లక్షణాలతో అస్వస్థతకు గురి కావడం ఇటీవల తరచుగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. పూళ్ల గ్రామంలో గత రెండు రోజులుగా 25 ఏళ్లు పైబడిన యువకులు, మహిళలు ఉన్నట్టుండి మూర్చవచ్చి పడిపోతున్నట్లుగా సమాచారం. పూళ్లలో అస్వస్థతకు గురైన వారికి రక్త పరీక్షలు, షుగర్‌, బీపీ పరీక్షలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

https://youtu.be/nj86OA-baus