AP PRC : మేము వారితోనే అంటున్న ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక.. కీలక నిర్ణయం

వీరి పోరాటానికి ఆర్టీసీ కార్మికులు మద్దతు తెలిపారు. అందులో భాగంగా... సమ్మెలోకి వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. అన్ని సంఘాలు కలిసి ఏకతాటిపైకి వచ్చి సమ్మెకోసం కార్యాచరణ...

AP PRC :  మేము వారితోనే అంటున్న ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక.. కీలక నిర్ణయం

Apsrtc

APSRTC Unions Support : ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక కీలక నిర్ణయం తీసుకుంది. పీఆర్సీ సాధన సమితితో కలిసి పోరాడాలని, 2022, జనవరి 29వ తేదీ శనివారం నుంచి నిరసన దీక్షల్లో పాల్గొనాలని డిసైడ్ అయ్యింది. వచ్చే నెల 03, 04వ తేదీల్లో అన్ని డిపోల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. పీఆర్సీ సాధన సమితి ప్రకటించినట్లుగా.. ఫిబ్రవరి 07వ తేదీ నుంచి సమ్మెలో పాల్గొంటామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. గత కొన్ని రోజులుగా ఏపీలో పీఆర్సీ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Read More : AP PRC Issue : చర్చలు షురూ… పీఆర్సీ సాధన సమితితో సంబంధం లేకుండా

కొత్త పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని.. పాత వేతనాలు చెల్లించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రభుత్వానికి సమ్మె నోటీసు కూడా ఇచ్చింది. వీరి పోరాటానికి ఆర్టీసీ కార్మికులు మద్దతు తెలిపారు. అందులో భాగంగా… సమ్మెలోకి వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. అన్ని సంఘాలు కలిసి ఏకతాటిపైకి వచ్చి సమ్మెకోసం కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించాయి. ఆర్టీసీ ఉద్యోగుల ఐక్య వేదిక పేరిట ఆర్టీసీ ఉద్యోగులు 2022, జనవరి 28వ తేదీ శుక్రవారం సమావేశమయ్యారు. విజయవాడలోని గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరిగింది. ఆర్టీసీ ఎన్ఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ సహా అన్ని సంఘాల నేతలు హాజరయ్యారు. సమావేశంలో పీఆర్సీ సాధన సమితి ముఖ్య నేతలు పాల్గొన్నారని సమాచారం.

Read More : Supreme Court : 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేసిన సుప్రీంకోర్టు

ప్రభుత్వంలో విలీనం అనంతరం ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటోన్న సమస్యలపై సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు ఫిట్ మెంట్ ఇవ్వాలని సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వైద్యపరంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు సహా కోల్పోయిన పీఆర్సీని తిరిగి రాబట్టుకోవడం, సర్వీసు రూల్స్‌లో జరుగుతోన్న అన్యాయం తదితర సమస్యలపై సమగ్రంగా చర్చించారు. ఫిబ్రవరి 6 ఆర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన పీఆర్సీ సాధన సమితికి ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమ్మెను విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణను రూపొందించి అనంతరం నేతలు ప్రకటించనున్నారు.