AP : ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి దంపతుల విగ్రహాల రగడ..మరోసారి కిషోర్ రెడ్డి, అఖిలప్రియ మధ్య వివాదం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మరోసారి భూమా కుటుంబంలో విగ్రహాల రాజకీయ చెలరేగింది.నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి విగ్రహాల ఆవిష్కరణ విషయంలో కిషోర్ రెడ్డి,అఖిల ప్రియల మధ్య మళ్లీ వివాదం.

AP : ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి దంపతుల విగ్రహాల రగడ..మరోసారి కిషోర్ రెడ్డి, అఖిలప్రియ మధ్య వివాదం

Andhra Pradesh Another Controversy Broke Out In The Bhuma Family Once Again In Allagada Karnool

andhra pradesh : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అంటే భూమా రెడ్డి అడ్డాగా పేరుంది. అటువంటి ఆళ్లగడ్డలో ఆళ్లగడ్డలో మరోసారి భూమా కుటుంబంలో విగ్రహాల రాజకీయ చెలరేగింది. భూమా నాగిరెడ్డి వర్థంతి సందర్భంగా భూమా కిషోర్ రెడ్డి తన సొంత స్థలంలో నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి విగ్రహాలను బీజేపీ నేత భూమా కిషోర్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈక్రమంలో విగ్రహాలు ఏర్పాటు చేసిన కిశోర్ రెడ్డికి తెలియకుండానే భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం విగ్రహాలకు పాలాభిషేకం కూడా చేశారు. అఖిల ప్రియ చేసిన ఈ చర్యలపై కిశోర్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. విగ్రహాల రగడ మొదలైంది. ఈరోజు వర్థంతి (మార్చి 12,2017లో నాగిరెడ్డి మరణం) సందర్భంగా ఆ విగ్రహాలను భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు జగద్విఖ్యాత రెడ్డి వచ్చి ఆవిష్కరించారు. అనంతరం పాలాభిషేకం చేశారు.

Also read : Sajjala Ramakrishnareddy: నవరత్నాలతో సీఎం జగన్ వేసిన విత్తనాలకి చెట్లు, పండ్లు ఇప్పుడు కనిపిస్తున్నాయి

దీంతో కిషోర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. భూమా కుటుంబ సభ్యుడిగా తన సొంత స్థలంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను అఖిలప్రియ తనకు తెలియకుండా ఎలా ఆవిష్కరిస్తారని ప్రశ్నిస్తున్నారు కిశోర్ రెడ్డి. గత కొంత కాలంగా భూమా కుటుంబంలో వివాదాలు జరుగుతున్నాయి. అఖిలప్రియ వైఖరి నచ్చక భూమా కిషోర్ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. ఆయన వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేయాలని భావిస్తుండటంతోనే ఈ వివాదం తలెత్తినట్లు తెలిసింది.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అంటే భూమా రెడ్డి అడ్డాగా పేరుంది. అటువంటి ఆళ్లగడ్డలో భూమా కుటుంబాల్లో వివాదాలు కొనసాగుతునే ఉన్నాయి. 1964 జనవరి 8 న జన్మించిన భూమా నాగిరెడ్డి 1992 లో ఏపీ శాసనసభకు మధ్యంతర ఎన్నికలలో ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఉన్న ఈయన సోదరుడు భూమా శేఖర్‌రెడ్డి ఆకస్మిక మరణం చెందడంతో ఈయన ఈ స్థానానికి ఎంపికయ్యారు. 1996 లో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న నంద్యాల లోకసభ నియోజకవర్గంనకు ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుపై పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఈయనను ఎంపిక చేయడంతో వెలుగులోకి వచ్చారు. ఈయన లోక్‌సభ సభ్యునిగా మూడు సార్లు తన సేవలను అందించారు. ఈక్రమంలో నాగిరెడ్డి 2017 మార్చి 12న గుండెపోటుతో మరణించారు.

Also read : Telangana : శాతవాహన యూనివర్శిటీలో ఎలుగుబంటి సంచారం..భయాందోళనలో విద్యార్థులు

భూమా నాగిరెడ్డి మరణానికి ముందే ఆయన భార్య శోభానాగిరెడ్డి 2014, ఏప్రిల్ 24న కారు ప్రమాదంలో మరణించారు. టీడీపీ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా పనిచేసిన శోభానాగిరెడ్డి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించాక ఆ పార్టీలో చేరారు. ఆ తరువాత వైసీపీలో జాయిన్ అయ్యారు.2014 ఎన్నికల ప్రచారంలో నంద్యాలలో వైఎస్ షర్మిల పాటు శోభానాగిరెడ్డి కూడా వైసీపీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి, ఆమె భర్త భూమా నాగిరెడ్డి నంద్యాల అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో షర్మిలకు వీడ్కోలు పలికి… శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డకు బయలుదేరారు.

Also read : Operation To Cobra : నాగుపాము పొట్టలో ఇరుక్కున్న సారా సీసా మూత..ఆపరేషన్ చేసిన తొలగించిన డాక్టర్లు

దీబగుంట్ల సమీపంలోని జాతీయ రహదారిపై స్థానిక రైతులు వేసిన ఆరబోసిన ధాన్యపు కుప్పల్లోకి ఆమె ప్రయాణిస్తున్న వాహనం దూసుకెళ్లింది. ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో శోభానాగిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు.లో అక్కడ చికిత్స పొందుతూ 24వ తేది ఉదయం 11.05 గంటలకు మరణించారు.