Sajjala Ramakrishnareddy: నవరత్నాలతో సీఎం జగన్ వేసిన విత్తనాలకి చెట్లు, పండ్లు ఇప్పుడు కనిపిస్తున్నాయి

కుప్పంతో సహా టీడీపీని ప్రజలు చెత్త బుట్టలో పడేసారు టీడీపీ సినిమాకి 2024లో శుభం కార్డు పడబోతుందని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Sajjala Ramakrishnareddy: నవరత్నాలతో సీఎం జగన్ వేసిన విత్తనాలకి చెట్లు, పండ్లు ఇప్పుడు కనిపిస్తున్నాయి

Sajjala

Sajjala Ramakrishnareddy: నవరత్నా పథకాలతో సీఎం జగన్ వేసిన విత్తనాలు చెట్లుగా ఎదిగి, ఇప్పుడు పండ్లు కాస్తున్నాయని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. రాష్ట్రంలో 9 కార్యక్రమాలతో మొదలుపెట్టిన సంక్షేమ పధకాలు ఈరోజు 90కి పైగా చేరుకున్నాయని సజ్జల అన్నారు. ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చి, రాజకీయాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ వైసీపీనేనని ఆయన తెలిపారు. అధికారం కోసమే కాదు ప్రజలకు సేవ చేయడానికే అని సీఎం జగన్ నిరూపించారని సజ్జల పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడేళ్ళుగా సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తూ వచ్చారని అన్ని వర్గాలకు రాజకీయ సాధికారత చేకూర్చేలా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకున్నారని సజ్జల తెలిపారు.

Also read: AP Cabinet Expansion : ఏపీ కేబినెట్ విస్తరణ.. మంత్రివర్గంలో ఎవరిని ఉంచుతారు? ఎవరిని తొలగిస్తారు?

మహిళలకు నిజమైన సాధికారత కల్పించేలా 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్ సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ లేనంతగా సీట్లు నిండిపోయాయని.. ప్రభుత్వ స్కూల్స్ లో సీటు కోసం ఎమ్మెల్యేలు సిఫారసులు చేసే పరిస్థితి వచ్చిందని సజ్జల తెలిపారు. ఇవేవి గుర్తించని ప్రతిపక్షాలు వైసీపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read: Telangana : శాతవాహన యూనివర్శిటీలో ఎలుగుబంటి సంచారం..భయాందోళనలో విద్యార్థులు

కుప్పంతో సహా టీడీపీని ప్రజలు చెత్త బుట్టలో పడేసారన్నా సజ్జల..టీడీపీ సినిమాకి 2024 లో శుభం కార్డు పడబోతుందని అన్నారు. 160 సీట్లు వస్తాయని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని..అది విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 160 సీట్లు అనడం కూడా అమరావతి గ్రాఫిక్ లాంటిదేనని చంద్రబాబు నుద్దేశించి సజ్జల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “చంద్రబాబుకి తెలిసిన విద్య వెన్నుపోటు ఒక్కటే.. ఆయన చుట్టూ కూడా అలాంటి వారే ఉన్నారు” అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు సజ్జల. రాష్ట్రంలో ప్రధాన పార్టీల నుద్దేశించి సజ్జల మాట్లాడుతూ మొత్తం అందరూ కలిసి 2024 ఎన్నికలకు వచ్చే ప్లాన్ చేస్తున్నారు.. వైసీపీకి వీళ్ళేవరు ప్రత్యర్ధులు కారని చెప్పుకొచ్చారు. వైసీపీ కార్యకర్తలు అంతా ప్రజలతో మమేకం కావాలని, ప్రతిపక్షాల కుట్రలు ప్రజలకు చెప్పాలని సజ్జల అన్నారు. రాష్ట్రానికి అరిష్టం లా టీడీపీ తయారయ్యింది.. 2024 లో శాశ్వతంగా తుడిచెయ్యాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also read: Chief Justice NV Ramana : హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ భవనం.. భూమిపూజ చేసిన చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ