Nandamuri Suhasini Son Marriage: మనవడి వివాహ వేడుకలో సందడి చేసిన చంద్రబాబు, బాలయ్య .. ఫొటోలు వైరల్

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంటున్నారు. మరో ఏడాదిలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో..

Nandamuri Suhasini Son Marriage: మనవడి వివాహ వేడుకలో సందడి చేసిన చంద్రబాబు, బాలయ్య .. ఫొటోలు వైరల్

Chandrababu and Balakrishna

Updated On : August 21, 2023 / 9:25 AM IST

Chandrababu Balakrishna: నందమూరి ఫ్యామిలిలో పెళ్లి బాజాలు మోగాయి. నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసి కుమారుడు వెంకట శ్రీహర్ష వివాహం సాయి గీతికతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ పెళ్లివేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరితోపాటు ఇతర రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అదేవిధంగా సినీ ప్రముఖులుకూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వీరిలో మేనల్లుడి పెళ్లి కావడంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు దగ్గరుండి పెళ్లి పనులు కూడా చూసుకున్నారు.

Chandrababu Naidu

Chandrababu Naidu

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంటున్నారు. మరో ఏడాదిలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబుతో పాటు, బాలక్రిష్ణ పార్టీ  కార్యక్రమాల్లో తీరికలేకుండా గడుపుతున్నారు. అయితే, కుటుంబ సభ్యురాలు నందమూరి సుహాని కుమారుడి వివాహం కావటంతో వారు పెళ్లి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈసందర్భంగా వివాహానికి హాజరైన ప్రముఖులతో బాలక్రిష్ణ, చంద్రబాబు సరదాగా మాట్లాడుతూ కనిపించారు. చంద్రబాబు నాయుడు పెళ్లి వేడుకలో బంధువులను, ప్రముఖులను పలుకరిస్తూ కనిపించారు. వివాహ వేడుకలో బాలయ్య, చంద్రబాబు సరదాగా మాట్లాడుకుంటున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Chandrababu Naidu and balakrishna

Chandrababu Naidu and balakrishna

నందమూరి సుహాసిని గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి తెలంగాణ టీడీపీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అయితే, మరికొద్ది రోజుల్లో త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి ఆమె టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

Chandrababu Naidu and balakrishna

Chandrababu Naidu and balakrishna