TDP Mahanadu 2023 : స్కాముల్లో జగన్‌ది మాస్టర్ మైండ్.. పుట్టబోయే బిడ్డపై కూడా అప్పు వేసేలా ఏపీలో పాలన..

కోడికత్తి డ్రామా.. మద్య నిషేధం వంటివన్నీ డ్రామాలతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేశాడంటూ ఆరోపించారు. రావణాసురుడు సాధువు రూపంలో వచ్చి సీతను ఎత్తుకెళ్లినట్టు.. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ఓట్లేయించుకుని ప్రజల్ని నట్టేట ముంచారంటూ విమర్శించారు.

TDP Mahanadu 2023 : స్కాముల్లో జగన్‌ది మాస్టర్ మైండ్..  పుట్టబోయే బిడ్డపై కూడా అప్పు వేసేలా ఏపీలో పాలన..

TDP Mahanadu 2023 Chandrababu

TDP Mahanadu 2023 – Chandrababu : టీడీపీ మహానాడులో చంద్రబాబు మాట్లాడుతు సీఎం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో నాలుగేళ్లల్లో రూ. 2.47 కోట్ల అవినీతి జరిగిందని.. ఏపీలో సంపద దోపిడీ ఎక్కువ.. ధరల బాదుడు ఎక్కువగా ఉంది అంటూ విమర్శించారు. స్కాములు చేయటంలో జగన్ ది మాస్టర్ మైండ్ అన్నారు. జగన్ నోరు తెరిస్తే అబద్దాలే చెబుతారని.. కోడికత్తి డ్రామా.. మద్య నిషేధం వంటివన్నీ డ్రామాలతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేశాడంటూ ఆరోపించారు. రావణాసురుడు సాధువు రూపంలో వచ్చి సీతను ఎత్తుకెళ్లినట్టు.. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ఓట్లేయించుకుని ప్రజల్ని నట్టేట ముంచారంటూ విమర్శించారు.

TDP Mahanadu : తెలుగుదేశం మహానాడు.. ఏపీకి సంబంధించి 15 తీర్మానాలు

రూ. 2 వేల నోట్లన్నీ జగన్ దగ్గరే ఉన్నాయని అన్నారు.పెద్ద నోట్ల రద్దుకు టీడీపీ ఇప్పటికి కట్టుబడి ఉందని స్పష్టంచేశారు.టీడీపీకి సంక్షేమం తెలుసు.. సంపద సృష్టి తెలుసు..అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టింది టీడీపీయేనని అన్నారు. పేదలకు ఫించన్లివ్వడం మొదలు పెట్టింది టీడీపీయేనని గుర్తుచేశారు. టీడీపీ విజన్ ఏంటో హైదరాబాద్ చూస్తే తెలుస్తుందన్నారు. కానీ నాలుగేళ్ల క్రితం కొత్తగా వచ్చాడు.. ఒక్క ఛాన్స్ అన్నాడు.. కోడి కత్తి అన్నాడు.. డ్రామా ఆడాడు.. రాష్ట్రాన్ని నాశనం చేయడం ప్రజా వేదిక నుంచే ప్రారంభించాడు. అన్ని వ్యవస్థలను నాశనం చేశారు అంటూ జగన్ పై విమర్శలు సంధించారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా రాజధాని లేని రాష్ట్రం లేదు.. ఈ దుస్థితి కారణం కూడా కోడికత్తి డ్రామా నేతేనంటూ సెటైర్లు వేశారు.

పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని.. ప్రాజెక్టుల మాటేలేదన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వం స్పాన్సర్డ్ టెర్రరిజం పెరిగిందని ఆరోపించారు. పెట్టుబడులు లేవు. జాబ్ క్యాలెండ్ మాటేలేదు.. రాష్ట్రంలో ఉన్న ఈ దుస్థితితో నిరుద్యోగులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. దిశా చట్టం అంటూ హంగామా చేసిన దిశా దశాలేని పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం మెడలు వంచుతానన్నాడు.. కేసుల కోసం కేంద్ర ప్రభుత్వానికి సాష్టాంగం నమస్కారాలు చేస్తున్నాడని విమర్శించారు. మద్యపాన నిషేధం పెడతానన్న పెద్ద మనిషి మద్యంతో వచ్చే ఆదాయాన్నే దోచేస్తున్నాడని ఆరోపించారు. అన్ని రంగాల్లోనూ ఏపీ వెనుకబడిపోయిందని.. పుట్టబోయే బిడ్డ పైనా అప్పు వేసేలా అధ్వాన్న దుస్థితిలోకి ప్రజల్ని నెట్టేశారని వైసీపీ ప్రభత్వంపై విరుచుకుపడ్డారు చంద్రబాబు.

TDP Mahanadu 2023 : తెలుగుదేశం జెండా తెలుగు జాతికి అండ .. జెండాలో నాగలిని ఎన్టీఆర్ అందుకే పెట్టారు : చంద్రబాబు

ఏపీ సీఎం ధనికుడు.. కానీ పేదవాడినని పచ్చి అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. ఇసుక లేకపోవడం వల్ల పనుల్లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. అధికార పార్టీ నేతలు ఇసుక దందాలు కొనసాగిస్తు శ్రీమంతులవుతున్నారని ఆరోపించారు. పవిత్రమైన తిరుమలలో కూడా గంజాయి వ్యాపారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ జెండా.. తెలుగు జాతి అజెండా. సంక్షేమం, అభివృద్ధి టీడీపీ సైకిలకున్న రెండు చక్రాలని అన్నారు. నాలుగేళ్లపాటు టీడీపీ కార్యకర్తలు ఎన్నో కష్టాలు పెట్టినా ఎవ్వరు భయపడలేదని అదీ టీడీపీ కార్యకర్తల అంకిత భావం అని ప్రశంసించారు. జై జగన్ అంటే వదిలేస్తామన్నా.. వినకుండా జై తెలుగుదేశం అంటూ ప్రాణాలొదిలిన కార్యకర్తలు టీడీపీ ఆస్తులని అన్నారు. కార్యకర్తల త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నా. భవిష్యత్తులో కార్యకర్తలని ఆదుకునే బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు చంద్రబాబు.