TDP Mahanadu 2023 : తెలుగుదేశం జెండా తెలుగు జాతికి అండ .. జెండాలో నాగలిని ఎన్టీఆర్ అందుకే పెట్టారు : చంద్రబాబు

మహానాడు ద్వారా మళ్ళీ చరిత్ర తిరగరాసే రోజు ఈ రోజు. పార్టీ సింబల్ సైకిల్,సైకిల్ అంటూ సామాన్యుడి వాహనం. ఇప్పుడు అదే సైకిల్ ని ఎలక్ట్రికల్ సైకిల్ చేస్తున్నా.సంపద సృష్టించడం, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు చేరువ చేసిన పార్టీ టీడీపీ.

TDP Mahanadu 2023 : తెలుగుదేశం జెండా తెలుగు జాతికి అండ .. జెండాలో నాగలిని ఎన్టీఆర్ అందుకే పెట్టారు : చంద్రబాబు

TDP Mahanadu 2023 Chandrababu

TDP Mahanadu 2023: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి వద్ద రెండు రోజులుపాటు టీడీపీ మహానాడు జరుగుతున్న సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగిస్తు ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు., ఎన్టీఆర్ శతజయంతి జరుపుకోవడం ఈ సారి మహానాడులో ప్రత్యేక అని తెలిపిన ఆయన రాజమండ్రి నుంచే మహానాడు ద్వారా మళ్ళీ చరిత్ర తిరగరాసే రోజు ఈ రోజు అని అన్నారు. రైతులను ఆదుకొనడం కోసమే ఆనాడే ఎన్టీఆర్ పార్టీ జెండాలో నాగలిని డిజైన్ చేశారని..తెలుగుదేశం జెండా తెలుగు జాతికి అండ అని వెల్లడించారు.

మన పార్టీ సింబల్ సైకిల్,సైకిల్ అంటూ సామాన్యుడి వాహనం. ఇప్పుడు అదే సైకిల్ ని ఎలక్ట్రికల్ సైకిల్ చేస్తున్నా అంటూ చంద్రబాబు తనదైన శైలిలో ప్రసంగించారు.పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తల త్యాగాలను జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని అదే తెలుగు దేశం పార్టీకి ఉన్న అంకిత భావం అని తెలిపారు.రేపు టీడీపీ ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలు, అభిమానుల కుటుంబాల అభివృది, బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు చంద్రబాబు. సంపద సృష్టించడం, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు చేరువ చేసిన పార్టీ టీడీపీ అని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పింఛను ప్రారంభించింది ఎన్టీఆర్ అని దాన్ని టీడీపీ ప్రభుత్వ హయాంలో 10 రెట్లు పెంచామని అన్నారు.ఈ రోజు హైద్రాబాద్ లో సంపద వస్తుంది అంటే ఆ రోజు టీడీపీ ప్రభుత్వం విజన్ అని తెలిపారు. 64 వేల కోట్ల రూపాయలు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఖర్చు చేసామని వెల్లడించారు.

TDP Mahanadu 2023: టీడీపీ మహానాడులో తొలిరోజు ప్రతినిధుల సభ.. కార్యక్రమాల షెడ్యూల్ ఇలా.. May 27, 2023 / 08:41 AM IST

జగన్ పై చంద్రబాబు సెటైర్లు..
ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడిగీ అడిగీ అధాకారంలోకి వచ్చాక ప్రజల్ని పట్టించుకోవటం మానేశారని..ఒక్క అవకాశం అంటూ అడిగి రాష్ట్రాన్ని అంథకారంలోకి నెట్టారని ఆరోపించారు. ఒక్కసారి అన్నాడు..ముద్దు పెట్టాడు, తండ్రి లేని పిల్లోడు అన్నాడు, కోడి కొత్తి డ్రామా ఆడారు. అన్నీ డ్రామాలాడి తీరా అధికారంలోకి వచ్చాక..రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆ నాడు ప్రాజవేదిక ద్వారా మొదలు పెట్టి కూల్చివేతలతోనే రోజులు గడిపేస్తున్నారంటూ విమర్శించారు. చరిత్ర తిరగరాసేలా నేను అమరావతి నిర్మిస్తే..అసలు ఇప్పుడు రాజధానే లేని రాష్ట్రంగా చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. రోడ్ల మరమత్తలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు.

TDP Mahanadu 2023: మహానాడుకు సిద్ధమైన రాజమహేంద్రవరం.. పార్టీ ఎన్నికల తొలి మేనిఫెస్టోను ప్రకటించనున్న చంద్రబాబు

దిశా చట్టం అన్నారు, లేని చట్టానికి ఈ రాజమండ్రి లో స్టేషన్ పెట్టి ప్రజలను మోసం చేశారంటూ దుయ్యబట్టారు చంద్రబాబు. ఆ నాడు ప్రత్యేక హోదా లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు అన్నారు..25 ఎంపీ లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నారు కానీ ప్రత్యేక హోదా అనే మాట కేంద్రం వద్ద ప్రస్తావించనేలేదని ఆ ధైర్యం కూడా లేదని విమర్శించారు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తనకు అధికారం ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని గప్పాలు కొట్టారు..కానీ ఏమైంది ఆ హోదా ఇప్పుడు? అని ప్రశ్నించారు మహానాడు వేదికగా చంద్రబాబు. అమ్మ ఒడి పేరుతో డబ్బులిచ్చి..నాన్న బుడ్డి తో డబ్బులు లాక్కుంటున్నాడంటూ సీఎం జగన్ పై సెటైర్లు వేశారు. గడిచిన 4 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు అప్పులు చేసి, పుట్టే బిడ్డ పై కూడా అప్పు ఉండేలా చేశాడని జగన్ పై విమర్శలు చేశారు. ఇసుక కొరతతో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని..ఆరోగ్యశ్రీ కి హాస్పిటల్ కి డబ్బుకు ఇవ్వకపోతే హాస్పిటల్ యాజమాన్యాలు నిరసన తెలిపారని అని అన్నారు చంద్రబాబు